గురుకుల కాలేజీలో కలకలం.. వాష్‌రూమ్‌ లో విద్యార్థిని ప్రసవం

గురుకుల కాలేజీలో కలకలం.. వాష్‌రూమ్‌ లో విద్యార్థిని ప్రసవం
  • మహబూబాబాద్​ గురుకుల డిగ్రీ కాలేజ్​లో ఘటన

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: ఓ విద్యార్థిని మగ శిశువుకు జన్మనివ్వగా, ఆ శిశువు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కాలేజ్​ వాష్‌‌రూమ్ సమీపంలో నవజాత శిశువు మృతదేహాన్ని గుర్తించిన విద్యార్థినులు కళాశాల సిబ్బందికి తెలిపారు. 

వారు వచ్చి ప్రసవించిన విద్యార్థినిని గుర్తించి ఆమె తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహబూబాబాద్ టౌన్ పోలీసులు కాలేజ్​కు చేరుకుని విద్యార్థినిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. 

విద్యార్థిని గర్భం దాల్చిన విషయం కాలేజ్​ సిబ్బంది, తల్లిదండ్రులకు తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రిన్సిపల్ బిందు మాధవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.