న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం రద్దు చేసింది. సీజేసీ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం హైకోర్లు ఆదేశాలను కొట్టివేసింది. ఈ అంశాన్ని తాజాగా పరిశీలించాలని హైకోర్టుకు సూచించింది. రాహుల్‌గాంధీ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ కర్నాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపాలంటూ సీబీఐ, ఈడీలను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
