మావోయిస్టు ప్రభావిత జిల్లాల జాబితా నుంచి ఉమ్మడి వరంగల్‌లోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాలను తొలగించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నక్సల్ ఫ్రీ ఇండియా ప్రత్యేక నివేదికలో కీలక వివరాలు వెల్లడించారు.
ఒకప్పుడు మావోయిస్టు కార్యకలాపాలకు కీలక కేంద్రాలుగా ఉన్న ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ఇప్పుడు మావోయిస్టు ప్రభావం లేని జిల్లాలుగా ప్రకటించారు. 2024 ఏప్రిల్‌లో కేంద్ర హోంశాఖ విడుదల చేసిన జాబితాలో తెలంగాణ నుంచి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవి.
అయితే జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ జిల్లాలను 2024 ఏప్రిల్ నాటికే ఆ జాబితా నుంచి కేంద్రం తొలగించింది. లేటుస్టుగా దేశవ్యాప్తంగా 'నక్సల్స్ ప్రభావిత జిల్లా' హోదానే రద్దు చేయడంతో ఆ వర్గీకరణ నుంచి ములుగు జిల్లా కూడా పూర్తిగా తొలగించినట్లయింది.
