ఎన్కేపల్లి మోడల్ స్కూల్ లో విద్యార్థికి కరెంట్ షాక్..చందాలు వేసుకుని ప్రైవేట్ దవాఖానలో ట్రీట్ మెంట్

ఎన్కేపల్లి మోడల్ స్కూల్ లో విద్యార్థికి కరెంట్ షాక్..చందాలు వేసుకుని ప్రైవేట్ దవాఖానలో ట్రీట్ మెంట్
  • ఆలస్యంగా వెలుగులోకి..

పరిగి వెలుగు  : వికారాబాద్​ జిల్లా పూడూరు మండలం ఎన్కేపల్లి మోడల్​స్కూల్​లో ఓ విద్యార్థి కరెంట్​షాక్​తో గాయపడడంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​దవాఖానలో ట్రీట్​మెంట్​చేయిస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 13వ తేదీన ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఎన్కేపల్లి మోడల్​స్కూల్​లో 6వ తరగతి చదువుతున్న రేహాన్​కు 13వ తేదీన స్కూల్​ఆవరణలోని టేకు చెట్టు పక్కనున్న కరెంట్​వైర్​తగలడంతో షాక్​కొట్టింది. తోటి విద్యార్థులు, టీచర్లు, వికారాబాద్​ప్రభుత్వ దవాఖానకు తీసుకువెళ్లగా..తమ దగ్గర ఫెసిలిటీస్​లేవని మహావీర్​దవాఖానకు పంపించారు. అక్కడి నుంచి గాంధీకి..తర్వాత నిలోఫర్​కు తీసుకువెళ్లారు. వైద్య ఖర్చులను తాము భరిస్తామని ప్రిన్సిపాల్​హామీ ఇవ్వడంతో ఓ ప్రైవేట్​దవాఖానలో చేర్పించారు.

 అయితే, ప్రిన్సిపాల్, ​టీచర్లు, తోటి స్టూడెంట్స్​చందాలు వేసుకుని రూ. 35 వేలు మాత్రమే ఇవ్వడం, హాస్పిటల్​లో ఇప్పటికే రూ. 2.5 లక్షలు కావడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇంకా ఎక్కువే అవుతుందని, వైద్య ఖర్చులు భరించాలని ప్రిన్సిపాల్​తో వాగ్వాదానికి దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది.