ట్రక్ పార్క్ భూములు వేలం వేయొద్దు..హెచ్ఎండీఏ ఆఫీసు ఎదుట అఖిలపక్షం ధర్నా..

ట్రక్ పార్క్ భూములు వేలం వేయొద్దు..హెచ్ఎండీఏ ఆఫీసు ఎదుట అఖిలపక్షం  ధర్నా..

జూబ్లీహిల్స్, వెలుగు: కూకట్‌‌‌‌పల్లిలోని ట్రక్ పార్క్ భూముల వేలం వేయొద్దంటూ అమీర్‌‌‌‌పేట మైత్రీవనంలోని హెచ్‌‌‌‌ఎండీఏ హెడ్డాఫీసు ఎదుట అఖిలపక్ష ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. కూకట్​పల్లి బీఆర్ఎస్​ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ శంభీపూర్​రాజు, వామపక్ష పార్టీల లీడర్లు, ట్రక్ పార్క్ లబ్ధిదారులు, కాలనీవాసులు ఆందోళనలో పాల్గొన్నారు. నిరసనకారులు హెచ్ఎండీఏ ప్రధాన భవనంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తర్వాత ఎమ్మెల్యే, ఇతర నేతలను అరెస్టు చేసి కొద్దిసేపటి తర్వాత విడదుల చేశారు.