సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ట్రీసా–గాయత్రి జోడీ బోణీ

 సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ట్రీసా–గాయత్రి జోడీ బోణీ

లక్నో: సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌లో ఇండియా షట్లర్లు శుభారంభం చేశారు. హ్యాట్రిక్ టైటిల్ లక్ష్యంతో బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్లు ట్రీసా జాలీ– గాయత్రి గోపీచంద్ తొలి రౌండ్‌‌లో 21–-8, 21–-7 తేడాతో క్వాలిఫయర్స్‌‌ రష్మీ గణేశ్– అమృత ప్రముథేశ్‌‌ను చిత్తు చేశారు. విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో తాన్యా హేమంత్‌‌ 21–14, 18–21, 21–16తో దేవికా సిహాగ్‌‌పై, తస్నిమ్‌‌ మిర్‌‌ 21–7, 21–12తో మాళవిక బన్సోద్‌‌పై, ఇషారాణి 21–12, 25–23తో తలితా రమధాని విర్యావాన్‌‌ (ఇండోనేసియా)పై గెలిచి రెండో రౌండ్‌‌లోకి ప్రవేశించారు. 

రెండోసీడ్‌‌ తన్వీ శర్మతో జరిగిన మ్యాచ్‌‌లో గో జిన్‌‌ వీ (మలేసియా) 1–2తో వెనకబడి ఉన్న దశలో గాయంతో తప్పుకోవడంతో తన్వీకి వాకోవర్‌‌ విజయం లభించింది. మెన్స్‌‌ సింగిల్స్‌‌లో తుషార్‌‌ సువీర్‌‌ 21–11, 21–17తో జస్టిన్‌‌ హో (మలేసియా)పై, శాశ్వత్‌‌ దలాల్‌‌ 21–14, 16–21, 21–7తో మార్క్‌‌ షెల్లీ అల్కాలా (అమెరికా)పై గెలవగా, కిరణ్‌‌ జార్జ్‌‌ 4–21, 18–21తో రిచీ దుతా (ఇండోనేసియా) చేతిలో, శంకర్‌‌ ముత్తుస్వామి 17–21, 12–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడారు. విమెన్‌‌ డబుల్స్‌‌లో అశ్విని భట్‌‌–శిఖా గౌతమ్‌‌ 21–16, 23–21తో దియా–బారుణి పర్ష్వాల్‌‌పై నెగ్గారు. మెన్స్‌‌ డబుల్స్‌‌లో భార్గవ్‌‌ రామ్‌‌–విశ్వతేజ్‌‌ గొబ్బురు 16–21, 21–12, 21–15తో ఆర్య–ధ్రువ్‌‌ ఠాకూర్‌‌ను ఓడించారు.