న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్.. ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. వేలంలో పాల్గొంటున్న మొత్తం 994 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో అతనికి చోటు దక్కింది. అండర్–19 ఆసియా కప్‌లో ఇండియాకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్యవీర్, మోహిత్ ఉల్వా.. రూ. 30 లక్షల కనీస ధరతో వేలానికి సిద్ధమయ్యారు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, నితీష్ రాణా కూడా అన్‌క్యాప్డ్ జాబితాలో ఉన్నారు.
ఐపీఎల్ రూల్స్ ప్రకారం గత ఐదేళ్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని ఇండియా ప్లేయర్లను అన్‌క్యాప్డ్ విభాగంలోకి మారుస్తారు. వీళ్లిద్దరు కనీసం రూ. 50 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలానికి రానున్నారు. మన్‌దీప్ సింగ్, మయాంక్ మార్కండే, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా కూడా ఇందులో ఉన్నారు. విదేశీ ప్లేయర్లలో స్కాట్ బోలాండ్, జై రిచర్డ్‌సన్, డేవిడ్ వార్నర్, బెవాన్ జాకబ్స్ కూడా పేర్లు నమోదు చేసుకున్నారు. వీళ్ల బేస్‌ప్రైస్ రూ. 2 కోట్లుగా ఉంది. అయితే వీళ్లలో చాలా మంది సగం టోర్నీ మాత్రమే ఆడనున్నారు.
