దుబాయ్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారించడంతో ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లోనూ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం విడుదలైన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ టాప్-–10లో నిలిచారు. పంత్ (744), గిల్ (728), జైస్వాల్ (713) వరుసగా 6, 7, 9వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు.
కేఎల్ రాహుల్ నాలుగు ప్లేస్‌లు ఎగబాకి 25వ ర్యాంక్‌కు చేరగా, దేవదత్ పడిక్కల్ 15 స్థానాలు మెరుగుపడి 39వ ర్యాంక్‌లో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (856) మూడు ర్యాంక్‌లు మెరుగుపడి సంయుక్తంగా రెండో స్థానానికి దూసుకెళ్లాడు. మిచెల్ స్టార్క్ (881) టాప్‌లో ఉన్నాడు. మహ్మద్ సిరాజ్ (689), రవీంద్ర జడేజా (675) వరుసగా 17, 18వ ర్యాంక్‌ల్లో ఉన్నారు.
