జెనీవా: ఇండియా గ్రాండ్ మాస్టర్, డిఫెండింగ్ చాంపియన్ డి. గుకేశ్, జావోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్) మధ్య జరుగుతున్న వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో గేమ్ కూడా డ్రా అయ్యింది. ఇద్దరు ప్లేయర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో గేమ్ 20 ఎత్తుల వద్ద ముగిసింది. తొలి ఎత్తు ఆధిక్యాన్ని సద్వినియోగం చేసుకుని ముందంజ వేయాలని భావించిన గుకేశ్.. తెల్ల పావులతో 'లండన్ సిస్టమ్' ఓపెనింగ్‌తో ఆటను ప్రారంభించాడు.
నల్ల పావులతో ఆడిన సిందరోవ్ ఏడో ఎత్తులోనే తన రాణిని రంగంలోకి దించాడు. పదో ఎత్తు కల్లా కింగ్‌సైడ్ క్యాస్లింగ్ పూర్తి చేసి తన ఏనుగులను (రూక్స్) అనుసంధానించుకున్నాడు. తొలి గేమ్‌లో రక్షణాత్మక ఆటతీరు కోసం ఎక్కువ సమయం వెచ్చించిన గుకేశ్, రెండో గేమ్‌లోనూ ఆరంభంలోనే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒకానొక దశలో గుకేశ్ వద్ద 55 నిమిషాల సమయం మాత్రమే మిగలగా, సిందరోవ్ వద్ద గంటా 26 నిమిషాల సమయం ఉంది. ప్రస్తుతం ఇద్దరు చెరో పాయింట్‌తో సమంగా కొనసాగుతున్నారు.
