సెంచూరియన్: బౌలింగ్‌లో వియాన్ ముల్డర్ (7/31) చెలరేగడంతో.. బుధవారం ముగిసిన రెండో టెస్ట్‌లోనూ సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 219 రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. దాంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను హోమ్ టీమ్ 2–0తో కైవసం చేసుకుంది. సఫారీ జట్టు 494/7 ఓవర్‌నైట్ స్కోరు తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 184 రన్స్‌కు ఆలౌటైంది.
తౌహిద్ హ్రిదోయ్ (41), మహిఫుల్ ఇస్లామ్ (38), నజ్ముల్ షాంటో (34), తన్జిద్ హసన్ (29)తో సహా అందరూ విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌లో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మార్కో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు. ముల్డర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అకెర్‌మన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
