పద్మారావునగర్,వెలుగు : 'డీప్ ట్రస్ట్' ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు బుధవారం పాటిగడ్డలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 250 మంది మహిళలకు మొబైల్ హెల్త్ స్క్రీనింగ్ బస్సు ద్వారా మామోగ్రఫీ (రొమ్ము క్యాన్సర్), పాప్ స్మియర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) పరీక్షలు నిర్వహించారు.
ట్రస్ట్ వ్యవస్థాపక ధర్మకర్తలు డాక్టర్ రాకేష్ కలపాల, డాక్టర్ మధు వాసేపల్లి, సీఈఓ స్వాతి మొహంతి మాట్లాడుతూ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని , అందుకే ఈ ఏడాది హైదరాబాద్ వ్యాప్తంగా 25కు పైగా శిబిరాలు నిర్వహించి 2,500 మందికి పైగా మహిళలకు రూ.10 కోట్ల విలువైన ఉచిత పరీక్షలు చేశామని వెల్లడించారు.
అనుమానిత లక్షణాలు కనిపించిన వారికి బసవతారకం, ఒమేగా వంటి ప్రముఖ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ ద్వారా తదుపరి చికిత్స అందేలా సమన్వయం చేస్తున్నామని పేర్కొన్నారు. శిబిరాల నిర్వహణ, స్వచ్ఛంద సేవల కోసం 87903 34904 నంబర్లో సంప్రదించాలని కోరారు.
