ఏపీ సీఎం చంద్రబాబు , ఆయన కుటుంబ సభ్యులు మంగళగిరి -తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లి ఎంపీయూపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యులు ఓటు వేశారు.
మంగళగిరి -తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం ఉండవల్లిలోని గాదె రామయ్య సీతారామమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న మంత్రి లోకేష్... 53వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి ఓటు వేశారు.
