ప్రపంచ వ్యాప్తంగా కచరా వీడియోలు ఎక్కువగా అప్లోడ్ అవుతున్నది ఇండియాలోనేనట. ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ వీడియోల తొలగింపులో ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉందట. ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ లోనే ఎక్కువ వీడియోలు తొలగించినట్లు యూట్యూబ్ పేర్కొంది.
2026 ఏప్రిల్ నుంచి జూన్ అప్లోడ్ చేసిన వీడియోల్లో 34 లక్షల 40 వేల వీడియోలను యూట్యూబ్ తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా తొలగించిన వీడియోల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని గూగుల్ వెల్లడించింది.
యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉల్లంఘించినందుకు ప్రపంచవ్యాప్తంగా కోటి 10 లక్షల వీడియోలను తొలగించారు. ఇందులో భారత్ వాటా దాదాపు 31 శాతంగా ఉంది. గత మూడు నెలలలో పోలిస్తే భారత్ నుంచి తొలగించిన వీడియోల సంఖ్య 28 శాతం పెరిగింది. 12 లక్షల 40 వేల వీడియోలతో అమెరికా రెండో స్థానంలో ఉండగా.. 9 లక్షల 2 లక్షలతో ఇండోనేషియా మూడో స్థానంలో ఉందని కంపెనీ తెలిపింది.
వీడియోల తొలగింపునకు కారణాలు వీడియోల తొలగింపునకు ప్రధానంగా పిల్లల భద్రత (68.2 శాతం) కారణమని యూట్యూబ్ పేర్కొంది. తొలగించిన వాటిలో 98.6 శాతం వీడియోలను ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారానే గుర్తించారు. అప్‌లోడర్ ఐపీ అడ్రస్ ద్వారా ఆ వీడియో ఏ దేశానికి చెందినదో యూట్యూబ్ గుర్తిస్తుంది. వీడియోల తొలగింపునకు గల కారణాలను కంపెనీ గ్లోబల్ లెవల్లో మాత్రమే వెల్లడిస్తుంది.
ప్రభుత్వ అభ్యర్థనల్లో 61 శాతం పెరుగుదల గూగుల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ ప్రకారం 2026 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో భారత ప్రభుత్వం, కోర్టుల నుంచి వచ్చిన అభ్యర్థనలు 61 శాతం పెరిగాయి. మొత్తం 4 వేల ఆరు అభ్యర్థనలు రాగా.. అందులో 3 వేల 399 యూట్యూబ్‌కు సంబంధించినవే ఉన్నాయి. 65 వేల 91 అంశాలపై అభ్యర్థనలు అందాయి. ప్రపంచవ్యాప్తంగా రష్యా, దక్షిణ కొరియా తర్వాత భారత్ నుంచే ఎక్కువ అభ్యర్థనలు వచ్చినట్లు గూగుల్ తెలిపింది.
పోలీసుల నుంచే అధికం మొత్తం అభ్యర్థనల్లో పోలీసుల నుంచి వచ్చినవి 2,870 ఉన్నాయి. ఇది మొత్తం అభ్యర్థనల్లో దాదాపు 72 శాతంగా ఉంది. కోర్టుల నుంచి 695 అభ్యర్థనలు వచ్చాయి. పరువు నష్టం కారణంతో 2,130 అభ్యర్థనలు అందినట్లు కంపెనీ వెల్లడించింది.
భారత అభ్యర్థనల ఆధారంగా స్థానిక చట్టాల ఉల్లంఘన కింద 19 వేల 883 అంశాలను, సొంత పాలసీల కింద వెయ్యి 415 అంశాలను గూగుల్ తొలగించింది. మరో 19 వేల 402 అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సరైన సమాచారం లేకపోవడంతో 17 వేల 473 అంశాలపై స్పందించలేదని కంపెనీ స్పష్టం చేసింది.
