జ్యోతిష్యం:తులారాశిలో శుక్రుని గోచారం ..ఏడు రాశులవారికి స్వర్ణయుగం.. ఎప్పటివరకంటే..!

జ్యోతిష్యం:తులారాశిలో శుక్రుని గోచారం ..ఏడు రాశులవారికి స్వర్ణయుగం.. ఎప్పటివరకంటే..!

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్ర గ్రహం విలాసవంత జీవితం.. సంపద ,ఐశ్వర్యం , ప్రేమ, సుఖ సంతోషాల విషయంలో కీలక పాత్రపోషిస్తాడు.  అంతటి పవర్​ఫుల్​ శుక్రుడు  ప్రస్తుతం ఉదయస్థితిలో.. తులారాశిలో 2027 జులై 20 వ తేదీవరకు కొనసాగనున్నాడు.  ఈ విధంగా శుక్రుడి గోచారం వలన  ఏడు రాశుల వారికి స్వర్ణయుగమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . ! 

మేష రాశి:  తులారాశిలో శుక్రుడు ఉదయస్థితి  గోచారం  వలన ఈ రాశి వారికి అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది.కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. అనుకోకుండా ఆస్తి కలసి వస్తుంది.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. . కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం..జాయింట్ వెంచర్లు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి.వృత్తి వ్యాపారంలో పురోగతి లభిస్తుంది.  ఉద్యోగులు కంపెనీలు మారే అవకాశం ఉంది..  ప్రభుత్వ రంగం నుంచి ఆర్ధికంగా లాభాలు పొందే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. 

మిథున రాశి:  శుక్రుడు .. తులారాశిలో ఉదయస్థితి సంచారం వలన ఈ రాశి వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.  ప్రతి పనిలో కూడా శుభవార్తలు వింటారు. . డబ్బుకు సంబంధించి సానుకూల ఫలితాలు కలుగుతాయి.  భౌతికంగా సుఖాలు పెరుగుతాయి.ప్రతి విషయాన్ని  ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో  ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.   ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా ఆలోచించరు.  ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకోకుండా రాజీమార్గంలో పరిష్కారమై, బాగా లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు లభిస్తాయి.  గృహ యోగం పడుతుంది.నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. 

కర్కాటక రాశి:  శుక్రుడు .. తులారాశిలో ఉదయస్థితి సంచారం వలన ఈ రాశి వారికి ఆర్థింగా లాభాలు వస్తాయని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. ఈ కాలంలో జీవితంలో సానుకూల పరిస్థితులు పెరిగి, కొత్త ఆలోచనలు మనసులో ఉద్భవిస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయం ఇది, ఆర్థిక స్థితి బలపడుతుంది. దీర్ఘకాలం నుంచి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కెరీర్‌లో పెద్ద టార్గెట్ సాధన లేదా మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి, వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గి సుఖ సంతోషాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గంలో మంచిపెళ్లి సంబంధం కుదురుతుంది.

ధనుస్సు రాశి: శుక్రుడి గోచార ఫలితాల వలన ఈ రాశి వారికి అన్ని విధాలా సానుకూలంగా ఉంటుంది.  ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు వేచి చూస్తున్నాయి. సీనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇంటి వాతావరణం సంతోషకరంగా, ఉత్సాహంగా ఉంటుంది. భాగస్వామితో సమయం గడపడానికి అవకాశం ఏర్పడుతుంది.  దీర్ఘకాలం నుంచి ఉన్న వివాదాలు, తప్పుగా అర్థం చేసుకోవడాలూ, అపార్థాలూ తీరిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

కన్య రాశి: శుక్రుడు ఈ రాశి వారికి భాగ్య స్థానంలో ఉదయ స్థితిలో సంచారం వలన ఈ రాశి వారికి మనశ్శాంతి కలుగుతుంది. ఆర్థికంగా బాగా ఉన్నప్పటికి ఖర్చులు కూడా పెరుగుతాయి. వీరికి ఈ సమయంలో అనేక శుభసంకేతాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.   వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పుడితే అధికంగా లాభాలు వస్తాయి.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

తులా రాశి: ఇదే రాశిలో శుక్రుడు ఉదయస్థితిలో సంచారం వలన ఈ రాశి వారికి ఎంతో మేలు కలుగుతుంది. పెట్టుబడి కోసం ఎదురుచూసే వ్యాపారస్తులకు మంచి ఇన్వస్టర్స్​తో పరిచయాలు ఏర్పడుతాయి.  ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా..సంతృప్తికరంగానే ఉంటుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. జీవితంలో పెను మార్పులు వస్తాయి. సంపద పెరుగుతుంది.మనసులోని బాధలు తొలగిపోవడం, మనసులోని కోరికలు నెరవేరడం వంటివి చోటు చేసుకుంటాయి. తల్లి లేదా తల్లి వైపు వారి నుంచి ప్రేమాభిమానాలు చూరగొంటారు.

మకర రాశి: శుక్రుడు ఈ రాశికి లాభ స్థానంలో ఉదయస్థితిలో  సంచారం వలన ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం కలుగుతుంది. ప్రతి పనిలో కూడా కచ్చితంగా ఆర్థికగాలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. . బ్యాంక్ నిల్వలు పెరిగే అవకాశం ఉంది. .  కొత్తగా ఇల్లుగాని..భూమి కాని కొనే అవకాశం ఉంది.  ఉద్యోగం మారే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.  అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.  కుటుంబసభ్యల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వండి.  ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని  జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.