ఈ రోజుల్లో చాలామంది బిజీగా ఉంటారు. వేరే వాళ్లు చూస్తే ఎంత సంపాదన ఉందో చాలామందికి క్షణం తీరిక ఉండదు.. దమ్మెడి ఆదాయం ఉండదు. అలా ఇబ్బంది పడేవారు పండితుల దగ్గరకు వెళ్తే జాతక రీత్యా ఎలాంటి దోషం లేదని చెబుతున్నారు. కాని కష్టాలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. ఇలా ఇబ్బంది పడే వారు తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరబాట్లు చాలా సమస్యలకు కారణం అవుతుంది.. ఎలాంటి పొరపాట్లు చేస్తే జీవితం అస్తమయి.. గ్రహ పాట్లు కలుగుతాయో తెలుసుకుందాం. .
హిందూ సంప్రదాయాలప్రకారం ప్రతి ఇంటికి ఒక ఆచారం ఉంటుంది. ఆ ఆచారాలను తప్పకుండా పాటించాలి. ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు తెలియ చేయాలి. వాటిని ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగత విషయం.. కాని ఆచరించకపోతే మాత్రం ఇబ్బందులు వస్తూనే ఉంటాయని పండితులు చెబుతున్నారు.
ప్రతివ్యక్తి తెలుసుకొని ఆచరించాల్సిన విషయాలు
- 1.పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు,. సూర్యుడు ఉదయించిన తరువాత వాకిలి చిమ్ముకో కూడదు ,సూర్యుని మోహాన నీళ్లు చల్లినట్టు అవుతుంది. సూర్యభగవానుడు ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది.
- 2. నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడవాలి .. బెడ్ షీట్ ను శుభ్రంగా సర్దాలి. లేకుంటే దరిద్రదేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది.
- 3. అన్నం తిన్న తరువాత ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి కూర్చో కూడదు..తిన్న స్థలం నుండి కాస్త జరిగి చేయి కడుక్కోని కూర్చోవాలి. తిన్న ప్లేట్లో ఎట్టి పరిస్థితిలో చేయి కడుక్కోకూడదు. అన్నం తిన్న తరువాత కచ్చితంగా కాళ్లు కడుక్కోవాలి. చేయి కడుక్కోకుండా అక్కడే కూర్చుంటే ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు వస్తాయి.
- 4.మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి. బట్టలు ఉతికేటప్పుడు నీళ్లలో జాడిస్తారు. అలా జాడించిన నీళ్లను ఎట్టి పరిస్థితిలో కాళ్లపై పోసుకోకూడదు. వాటిని బాత్రూంలో పారబోసి మరల వేరే నీళ్లు పోయాలి. కాళ్లపై పోసుకున్నా.. అలానే ఆ నీళ్లను పారబోసి వేరే నీరు పోయకపోయినా .. ఆఇంట్లో జేష్ఠ దేవి ప్రవేశించి తిష్ఠ వేసుకొని కూర్చొంటుంది. ఇక అంతే ఆ ఇంట్లో కష్టాలు.. గొడవలు ప్రారంభమవుతాయి. ప్రవేశం దొరుకుతుంది.
- 5. ఇళ్లు ఊడ్చిన చీపురు నిల్చో బెట్టకూడదు.
- 6. వంట గదిలో వాడిన మసి బట్టలను పొద్దు పోయాక ఉతకకూడదు..
- 7.సంధ్య కాలంలో సంసారం నిషేధం.. నిద్రపోకూడదు.. ఆహారం తిన కూడదు.. గొడవలు పడకూడదు.. ఆ సమయం ప్రదోషం కాలం ,ధ్యానం పూజ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.
- 8.పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు . లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి, పెద్దగా ఉంటే బట్టలు కట్టి.. రోజూ దేవతార్చన చేసి మహానివేదన చేయాలి.
- 9. దేవాలయాలు.. పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పడు ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటినిండా పెట్టకూడదు.
- 10. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం.. సాయంత్రం కచ్చితంగా మంచినీరు ఉంచాలి. పొద్దున్నే లేచి చూసేవరకు అందులో ఎంతో కొంత తగ్గుతుంది. మిగిలిన నీటిని స్నానం చేసి పూజ చేసేటప్పుడు తీసేసి మన తలపై చల్లుకోవాలి. అనారోగ్యంగా ఉన్నవారికి తీర్థం మాదిరిగా ఇవ్వాలి. మిగిలిన నీటిని తొక్కని ప్రదేశంలో పోయాలి. వేప చెట్టు మొదల్లో పోస్తే మరీ మంచిది.
- 11. ఒక్క కుంది దీపం పెట్టె వాళ్ళు 3 ఒత్తులు వేయాలి, రెండు అంత కన్నా ఎక్కువ పెట్టేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది..
- 12. రోజూ వారి దీపారాధన కు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము,నోము, దీక్ష,పరిహారాలు,సమయంలో, దీపారాధనకు నువ్వుల నూనె, ఆవు నెయ్యి వాడాలి. ఆర్థిక స్తోమత లేకపోతే ఆముదం ,, కొబ్బరి నూనెతో చేయండి. కాని ఎట్టి పరిస్థితిలో కల్తీనూనె వాడకూడదు.
- 13. పూజ చేసేటప్పుడు ఆసనంపైనే కూర్చోవాలి. కింద అస్సలు కూర్చోకూడదు. పూజ అయిన వెంటనే ఆ ఆసనం తీసేయాలి. అలానే 5 నిమిషాలు కూడా ఉంచకూడదు.
- 14. సాయంత్రం ఆరు దాటాక సూది, ఉప్పు,నూనె,కోడి గుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి తెచ్చుకుంటే శని భగవానుడిపి మీ వెంట కొని తెచుకున్నట్టే..
- 15. ఏ రోజైనా పొద్దు పోయాక ( సూర్యాస్తమయం తరువాత) పెరుగు, ఊరగాయాలు, మిరపొడి ఎవ్వరికీ ఇవ్వకండి . కాని శుక్రవారం, మంగళవారం రోజుల్లో ఏ సమయంలో కూడా ఇవ్వకండి. ఇవి లక్ష్మీదేవి స్థానాలని పండితులు చెబుతున్నారు.
- 16.శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి..
- 17. జాతకంలో కుజ దోషం ఉన్న వారు... వ్యాపారం లో గొడవలు.. ఇబ్బందులు ఉన్న వారు .. ఎట్టిపరిస్థితిలో మంగళవారం రోజు గుడ్లు తినకండి. దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది.
- 18. శనివారం రోజు ఎట్టి పరిస్థితిలో నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రావద్దు. సిమెంట్, నూనె, ఉప్పు ఎట్టి పరిస్థితిలో శనివారం కొనకూడదు. ఎవరైనా శనివారం రోజు బహుమతులు గా ఇనుము వస్తువులు, నల్లటి, నీలి,వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి.
- 19. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉండాలి. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి..పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు. అందుకే ఎట్టి పరిస్థితిలో తలలో చేయి పెట్టకూడదు.
- 20. వంట చేసే వారు మాట్లాడుతూ అరుస్తూ చేయ కూడదు, వండే టప్పుడు పోరాబాటుగా కూడా మాట్లాడే టప్పుడు పడే ఉమ్ము అందులో పడితే అది మహా దోషం. పొరబాటుగా అది అతిథులకు పెడితే చాలా పాపం చుట్టుకుంటుంది.
- 21. ఇంట్లో తమలపాకు చెట్టు ఉండకూడదు. తోట ఉంటే తోటలోనే ఉంచండి తమల పాకు గౌరమ్మతో సమానం ఎట్టి పరిస్థితిలో మైలు గాలి తగల కూడదు..
- 22. ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు.
- 23.తులసి చెట్టు ఆకులు గోటితో గిల్ల కూడదు... ఎట్టి పరిస్థితిలో ఆడవారు అసలు కోయకూడదు. పొద్దు పోయాక( సూర్యాస్తమంతరువాత), ఆదివారం, గురువారం, ఏకాదశి , అమావాస్య, పౌర్ణమి తిథులలో తులసి మొక్కకు ఎట్టి పరిస్థితిలో నీరు పోయాకుడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడు గా భావించి పూజించండి.
- 24. దేవాలయం లో పూజించే విధంగా గాని గుడిలో గాని ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉండాలి. గృహంలో ఆవుతో ఉన్న కృష్ణుడు విగ్రహం చాలా మంచిది.
- 25.ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి.
- 26. ఏ సమయంలో కూడా గాజులు, తాళి ( మంగళసూత్రం) తీసి పక్కన పెట్టకూడదు, తాళిబొట్టులో దేవతా విగ్రహాలు.. డాల్లర్స్ ..పిన్నీసులు ఉండకూడదు. దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టాలి..
- 27.ఎట్టిపరిస్థితిలో అపశకునాలు మాటలాడకూడదు తథాస్తు దేవతలు మన భుజాల పైనే ఉంటారు. అందుకే పెద్దలు ఆశీర్వదిచేటప్పుడు చేతులను తలపై పెడతారు.
- 28.వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు నగలు పెట్టె బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం... తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు.
- 29. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది.
- 30. విడిచిన బట్టలు కాలితో తొక్క కూడదు... స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు.స్నానం చేసి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు.
- 31.ప్రతి రోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్క సారిఅయినా గడపకు పసుపుకుంకుమ పెట్టాలి.
- 32. ఉదయం లేవగానే పాచి మొహంతో అద్దం చూడకూడదు.. తల దువ్వ కూడదు,
- 33. భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు..
- 34.మంగళవారం, శుక్రవారం క్షుర ( కటింగ్) సంస్కారం చేయకూడదు.. గోర్లు తీయకూడదు, పేనులు కుక్కడం.. దువ్వడం చేయకూడదు.
- 35. రెండు చేతులతో తల గోక కూడదు .గోర్లు కొరుకుతూ ఉండకూడదు, కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదని పండితులు చెబుతున్నారు
- 36. తినే టప్పుడు తుమ్మితే చేయా కడుక్కొని మళ్ళీ తినాలి..
- 37. ఎవరికి వెండి వస్తువులు బహుమతులు గా ఇవ్వకూడదు.
- 38.ఇంటి గుమ్మం ముందు చెప్పులు వదల కూడదు ..కొంచెం దూరంగా వదలాలి,
- 39. ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తిని మిగిలినవి.. ఎవరికి పెట్టకూడదు.. ముఖ్యంగా భర్తకు ఎంగిలి చేసినవి ఆ సమయంలో పెట్టకూడదు. మైలు నియమం పాటించాలి.
- 40. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ... ఏ రోజుకు ఆ రోజు వ్యాపారం లో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు .. ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి .
- 41. జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం వారం నాడు ఉప్పు కొనాలి. అలా చేస్తే ఆ ఇంట్లో ధనం నిలుస్తుంది.
- 42. రాహు కాలంలో,స్నానం, భోజనం, సంసారం చేయాకుడదు .
- 43. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయం లో మాత్రమే పెట్టాలి.
- 44. గృహస్థులు ఏక వస్త్రంతో పూజ చేయాకుడదు.
ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు మనము పాటించాల్సిన కనీస నియమాలు. ఇవన్నీ పాటించకుండా ఎడ్డీమడ్డి గా ఉంటూ ఆ పూజలు చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. జ్యోతిష్య ప్రకారం గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నా ఈ నియమాలు పాటించకపోతే కలిసిరాదని పండితులు చెబుతున్నారు.
ALSO READ : శుక్ర, గురు గ్రహాల మధ్య 60 డిగ్రీల కోణం.. ఐదు రాశులకు విశేష ఫలితం
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
