రోజూ మనం తింటున్న ఉప్పే ప్రాణాల మీదకు తెస్తుందా ? ఈ అలవాట్లు మార్చుకోండి!

రోజూ మనం తింటున్న ఉప్పే ప్రాణాల మీదకు తెస్తుందా ? ఈ అలవాట్లు మార్చుకోండి!

'అన్ని వేసి చూడు.. నన్ను వేసి చూడు' అంటుందట ఉప్పు. వంట ఏదైనా ఉప్పు కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఆ వంటకి పడే మార్కులు తగ్గిపోతాయి. అయితే.. కింగ్ ఆఫ్ టేస్ట్ అయినా మన బాడీలో ఉప్పు పర్సంటేజ్ ఎక్కువైతే మాత్రం విషం కన్నా ప్రమాదమే.

ఉప్పు చాలా అవసరం
రుచికి మాత్రమే కాదు, ఉప్పులో ఉండే సోడియం మన శరీరానికి చాలా అవసరం కూడా. సోడియం మన బాడీకి అత్యవసరమైన న్యూట్రియెంట్, మన బాడీ దాన్ని స్వయంగా తయారు చేసుకోలేదు కాబట్టి ఫుడ్ ద్వారా తీసుకోక తప్పదు. పొటాషియం,కాల్షియం,మెగ్నీషియంలాగా సోడియం కూడా ఒక ఎలక్ట్రోలైట్. మెదడు ఇచ్చే సిగ్నల్స్ ని  సరిగ్గా అందేలా చూడటానికి, నర్వ్ సిస్టమ్ యాక్టివ్ ఉండటానికి సోడియం చాలా అవసరం. అందుకే డీహైడ్రేషన్ అయినప్పుడు బాడీలో సోడియం పర్సంటేజ్ తగ్గిపోతే, మెమరీ, సెన్స్ తగ్గిపోతాయి. రుచి, వాసన, స్పర్శ వీటిమీద కంట్రోల్ ఉండదు. ఇంతేకాదు మజిల్స్ ఫ్లెక్సిబుల్ గా ఉండటానికి కూడా సోడియం అవసరమే.

ఐదు గ్రాములలోపే
WHO లెక్కల ప్రకారం ఒక మనిషి తీసుకోవాల్సిన ఉప్పు రోజుకి ఐదు గ్రాములకు దాటకూడదు. అయితే మనం కూరల్లో ఎక్కువ ఉప్పు వాడటం లేదనుకుంటాం. కానీ, ఐదు గ్రాములకన్నా ఎక్కువ ఉప్పు మన బాడీలోకి చేరిపోతూనే ఉంది. మారిపోతున్నలైఫ్ స్టైల్ లో కొత్తకొత్త ఫుడ్ హ్యాబిట్స్ వచ్చాయి. పచ్చళ్లు, చిప్స్,వేపుళ్లు, ఇన్స్టాంట్ నూడిల్స్, రెడీ టు ఈట్ ప్యాకెట్లు, కెచప్ ఇలా రకరకాల కాంటినెంటల్ డిషెస్, జంక్ ఫుడ్స్ మన మెనూలో చేరిపోతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన అజినో మోటో లాంటివి కూడా ప్రమాదకర స్థాయిలో వాడేస్తున్నారు.

ఎందులో... ఎంతెంత?
వారంలో కనీసం రెండు నుంచి మూడుసార్లు ఏదో ఒక చిరుతిండి అనో, చాట్ అనో తీసుకుంటున్న ఇన్స్టాంట్, స్ట్రీట్, రెస్టారెంట్ ఫుడ్స్ వల్ల ఎంతెంత సోడియం వచ్చి చేరుతుందో చూసుకుంటే...

పావ్ బాజీ- 3.54 గ్రాములు
ఇన్ స్టెంట్ నూడుల్స్- ప్రతి 80గ్రా నూడుల్స్ లో 0.95 గ్రాములు
దోశ, ఇడ్లీలలో వాడే చట్నీ, సాంబార్ కలిపి - 4.51 గ్రాములు
ఆలూ చిప్స్ (100 గ్రాముల్లో) - 0.8 గ్రాములు
 అయితే మనం మామూలుగా తీసుకునే ఫుడ్లో ఈ పర్సంటేజ్ చాలా తక్కువ.

100గ్రా. పాలు, పెరుగు 50మిల్లీగ్రాములు
100గ్రా.గుడ్లు 80మిల్లీగ్రాములు
100గ్రా.బ్రెడ్ 250మిల్లీగ్రాములు
100గ్రా. సోయా సాస్ 1500మిల్లీగ్రాములు అంటే రెగ్యులర్ గా జంక్ ఫుడ్, చట్నీలూ తింటే ప్రతీరోజూ మనం కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉప్పు తింటున్నట్టే. అయితే జంక్ ఫుడ్ మార్కెట్ మన దేశంలో విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. ఏటా వేల కోట్లలో జంక్ ఫుడ్ మార్కెట్ పెరిగిపోతోంది. ఉప్పుని వంటల్లో వేసుకోవటం తగ్గించటం వల్ల మాత్రమే ప్రమాదం తగ్గుతుంది అనుకుంటే పొరపాటే.

ALSO READ : గుడ్లను బయట ఉంచాలా ? ఫ్రిజ్‌లో పెట్టాలా ?

ఎలా తగ్గించుకోవాలి?
వీలైనంతగా జంక్ ఫుడ్ మానెయ్యాలి. బయట తినటం తగ్గిస్తే సరిపోదు. ఇంట్లో తయారు చేసుకునే చట్నీలు, పావ్ బాజీ, పానీ పూరీ లాంటి వంటల్లో ఉప్పుని బాగా తగ్గించాలి. ప్రాసెస్డ్ ఫుడ్, ఇన్స్టాంట్ ఫుడ్స్ మరీ అవసరమైతే తప్ప తినకుండా ఉండటమే మంచిది. రాక్ సాల్ట్, హిమాలయన్ ఉప్పు వాడటం మంచిది. తక్కువ సోడియం ఉండే లైట్ సాల్ట్స్ వాడాలి.

రుచిలో ఉప్పు చాక్లెట్స్, క్యాండీలు, ఇంట్లో చేసుకునే మ్యాగీ, కూల్ డ్రింక్స్లలో కూడా ఉప్పు లేదనుకోవద్దు వాటిలో సోడియం ఉంటుంది. అయోడినైజ్డ్ ఉప్పు వంటకాలు ఉడికేటప్పుడే వెయ్యకూడదు. అయోడిన్ ఆవిరై పోయి కేవలం ఉప్పు మాత్రమే మిగులుతుంది.