తెలంగాణ నీళ్లపై చంద్రబాబు కుట్ర : జల్ జీవన్ మిషన్ పేరిట దొడ్డిదారి జీవోలు

తెలంగాణ నీళ్లపై చంద్రబాబు కుట్ర : జల్ జీవన్ మిషన్ పేరిట దొడ్డిదారి జీవోలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'రివ్యాంప్డ్ జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం తమఅక్రమ నీటి కేటాయింపులకు రాజమార్గం గా మార్చుకుంది. 2025 మే నుంచి 2026 ఆగస్టు మధ్య ఏపీ జలవనరుల శాఖ వరుసగా నాలుగు జీవోలను జారీ చేసి, రాష్ట్రంలోని రూరల్ వాటర్ సప్లై స్కీం శాఖకు సొంతంగా నీటిని కేటాయించేసు కుంది. 

2025 మే 13న ఇచ్చిన ఒక్క జీవోతోనే 8 సోర్సుల నుంచి 13.538 టీఎంసీల నీటి తరలింపునకు ప్లాన్​ చేసింది. ప్రకాశం బ్యారేజ్​ నుంచి 4.489 టీఎంసీలు, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4.062 టీఎంసీలు, ఏలేరు రిజర్వాయర్ నుంచి 2.003 టీఎంసీలు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా 1,475 టీఎంసీలు, పులికనుమ రిజర్వాయ 5 లో 0.583 టీఎంసీలు, వెలిగల్లు రిజర్వాయర్ నుంచి 0.327 టీఎంసీలు, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 0,300 టీఎంసీలు, ఆవుకు రి జర్వాయర్ ద్వారా 0.299 టీఎంసీలు తరలించేలా జీవోలు జారీ చేసింది. ఇ

క 2025 నవంబర్ 24న కూడా మరో జీవో ఇచ్చింది. గండికోట రిజర్వాయర్ నుంచి 3.378 టీఎంసీల నీటి తరలింపునకు పచ్చ జెండా ఊపింది. లోటు సమయాలోనూ ఇందులో నుంచి సొంత ఏర్పాట్లు చేసుకోవాలంటూ రూరల్ వాటర్ సప్లైకి సూచించింది. 

ALSO READ : తెలంగాణ నీళ్లపై చంద్రబాబు కుట్ర : బనకచర్ల అని ఒక సారి

ఈ ఏడాది ఏప్రిల్ 16న ఇచ్చిన జీవో ప్రకారం వెలిగొండ రిజర్వాయర్ (నల్లమల సాగర్ రిజర్వాయర్) నుంచి ప్రాజెక్టు కమిష నింగ్ తర్వాత 1.737 టీఎంసీలు తీసుకునేలా ఆనుమతులు జారీ చేసింది. తాజాగా ఆగస్టులో ఇచ్చిన జీవోతో సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి 1,865 టీఎంసీల తరలింపులకు జీవో జారీ చేసింది. మొత్తంగా ఇవన్నీ కలిపితే 20:518 టీఎంసీల నీటిని ఏపీతన ప్రాంతా నికి తరలించేసుకోనుంది.