ఒక పది విమానాలు.. విమానాశ్రయంలోని రన్ వే పై కాకుండా నేషనల్ హైవేపై దిగితే ఎలా ఉంటుంది. హైవేపై వచ్చే ట్రాఫిక్ ను మళ్లించి ఆర్మీ విమానాలు క్యూకడితే చూసేవాళ్లకు అబ్బురం అనిపిస్తుంది కదా. ఇండియన్ ఆర్మీ చేసిన ఈ అరుదైన విన్యాసాలు వాహ్వా అనిపించాయి. ఆర్మీ విమానాల విన్యాసాలతో గుజరాత్ లోని ఒక జాతీయ రహదారి రన్ వేగా మారింది.
ఇండియన్ ఆర్మీకి చెందిన టీమ్ మౌంటైన్ ఈగిల్స్ బృందం నాలుగు మైక్రోలైట్ విమానాలను అమృత్ సర్-జామ్ నగర్ ఎకనామిక్ కారిడార్ (NH-754A) పై విజయవంతంగా ల్యాండ్ చేసింది. ‘వింగ్స్ ఆఫ్ వాలర్ అండ్ యూనిటీ ఎక్స్‌పెడిషన్’లో భాగంగా 2026 నవంబర్ 26 ఉదయం ఈ విన్యాసం నిర్వహించారు.
పటాన్ జిల్లాలోని బాకుత్రా టోల్ ప్లాజా దగ్గర ఉన్న కిలోమీటర్ 946 నుంచి 949 మధ్య ఉన్న రహదారిని ఈ ప్రయోగం కోసం ఎంచుకున్నారు. ఆర్మీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ), స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఈ ప్రక్రియను పూర్తి చేశాయి.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విన్యాసానికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. ఆర్మీ, ఎన్ హెచ్ ఏ ఐ మధ్య ఉన్న సమన్వయానికి ఇది నిదర్శనమని ఆయన చెప్పారు. హైవే నెట్‌వర్క్ దేశ భద్రత, అత్యవసర సమయాల్లో రక్షణ దళాల అవసరాలను తీరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
రెండు ఫిక్స్డ్ వింగ్ మైక్రోలైట్ విమానాలు, రెండు పవర్డ్ హ్యాంగ్ గ్లైడర్లు ఈ ప్రయోగంలో పాల్గొన్నట్లు పీఐబీ తెలిపింది. వీటిలో ఎక్స్-ఎయిర్ ‘హనుమాన్’, సవన్నా ఎంఎక్స్ పి 740, తనార్గ్ బయోనిక్స్, నువిక్స్ స్కైప్పర్ రకాలు ఉన్నాయి. ఈ విమానాలు కాండ్లా ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి హైవేపై దిగాయి.
ప్రయోగానికి ముందు ఎన్ హెచ్ ఏ ఐ సాంకేతిక బృందాలు రహదారిని తనిఖీ చేశాయి. విమానాలు దిగడానికి రోడ్డు ఉపరితలం అనువుగా ఉందో లేదో పరీక్షించాయి. ఆ సమయంలో హైవేపై ట్రాఫిక్ ను తాత్కాలికంగా నిలిపివేసి, వాహనాలను ఇతర దారిలో మళ్లించారు. ఆర్మీ గ్రౌండ్ సపోర్ట్ సిబ్బంది హైవేపైనే మొబైల్ రీఫ్యూయలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.
ప్రయోగం ముగిసిన వెంటనే ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఎంహౌ లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఎంసీటీఈ) ఈ యాత్రను నిర్వహించింది. 2026 నవంబర్ 14న మొదలైన ఈ యాత్ర నవంబర్ 28న ముగుస్తుంది. ఇది మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సాగుతుంది.
సరైన భద్రతా చర్యలు ఉంటే జాతీయ రహదారులను అత్యవసర సమయాల్లో, పర్యాటక రంగంలో, సాహస క్రీడల కోసం వాడుకోవచ్చని నితిన్ గడ్కరీ చెప్పారు. దేశ అభివృద్ధి, రక్షణ అవసరాలకు తగ్గట్లుగా రోడ్డు నెట్‌వర్క్ ను బలోపేతం చేస్తున్నట్లు వివరించారు.
🇮🇳 INDIAN ARMY MICROLIGHTS LAND ON A GUJARAT HIGHWAY 📌 WHAT: 4 Army microlight aircraft landed and took off from a national highway stretch 🏢 WHO: Army 'Team Mountain Eagles', with NHAI coordination 📅 WHEN: Date not stated in the source (reported) 🎯 WHAT IS THIS? Army pilots flying on the Wings of Valour and Unity Expedition used a closed highway stretch as a runway. 🛠️ KEY FACTS (reported) • Aircraft: 4 microlights, type not stated • Location: Amritsar–Jamnagar corridor (NH-754A), Gujarat • Stretch: Km 946 to Km 949, about 3 km • Operation: landing and take-off by all four aircraft ⚙️ HOW IT WORKS A straight, flat section is cleared of traffic and cordoned off. Light aircraft need far less runway than jets, so a short highway stretch is enough. 🔬 WORKING PRINCIPLE Microlights are light and slow, so they can use short, ordinary surfaces. A highway gives a prepared surface when an airfield isn't nearby. 👍 PROS: Shows pilots can operate off airfields, builds coordination with civil authorities 👎 CONS: Microlights are not combat aircraft, and the stretch had to be closed to traffic 🇮🇳 WHY IT MATTERS India already treats highways as backup runways. IAF jets have landed on expressways, and Army helicopters trained on NH-911 in Sept 2026. 🧠 OUR ANALYSIS This is adventure aviation, not a combat capability. Its value is practice at operating from improvised strips, and the Army-NHAI planning that goes with it. ❓ WHAT WE DON'T KNOW Aircraft types, exact date, whether more highway stretches are planned, and any link to the IAF's emergency landing facilities. 📷 Credit: Indian Army / NHAI (as supplied) #IndianArmy #Microlight #ArmyAviation #HighwayLanding #TeamMountainEagles #DefencewithIndia
— DefenceWithIndia (@LuharQA) November 26, 2026
