ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
మొత్తం ఖాళీలు: 23.
విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ 8, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ 7, ప్రాజెక్ట్ ఇంజినీర్–I 8.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
ఇంజినీరింగ్ బ్రాంచీలు: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ (ఈసీఈ), ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఐటీ సపోర్ట్/హెల్ప్‌డెస్క్ రోల్స్‌కు మెకానికల్ ఇంజినీరింగ్ కూడా అనుమతిస్తారు.
వయసు: సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టులకు 45 ఏళ్లు, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ 40 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్-–I 32 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: పీడబ్ల్యూబీడీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇతరులు రూ. 400/ రూ.450 చెల్లించాలి.
లాస్ట్ డేట్: డిసెంబర్ 9.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కనీస అర్హత మార్కులు: రాత పరీక్షలో జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలు 35 శాతం, ఇంటర్వ్యూలో 35 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ bel-india.inను సందర్శించండి.
– వెలుగు, ఎడ్యుకేషన్
