Homemade Hair Oil: మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ ఆయిల్స్ వాడి జుట్టు రాలిపోతోందని టెన్షన్ పడుతున్నారా? అయితే ఎలాంటి రసాయనాలు (Chemicals) లేకుండా, మన ఇంట్లో దొరికే సహజమైన పదార్థాలతోనే అద్భుతమైన హెయిర్ ఆయిల్స్ తయారు చేసుకోవచ్చు. ఈ హోమ్మేడ్ ఆయిల్స్ కుదుళ్లకు బలాన్నిచ్చి, జుట్టును ఒత్తుగా, మెరిసేలా చేస్తాయి. ఆ రెండు సింపుల్ ఆయిల్ రెసిపీలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
జుట్టు ఒత్తుగా పెరిగేందుకు.. మందార – కొబ్బరి నూనె:
* మందార పువ్వుల్లో జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తయారు చేయడం చాలా సులభం.
* తయారీ విధానం: ముందుగా ఒక పాన్లో అరకప్పు కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి.. అందులో 20 మందార పువ్వులను వేసి సన్నటి మంటపై ఉడికించాలి.
* రాత్రంతా నానబెట్టాలి: నూనె మందార పువ్వు (Hibiscus Coconut Oil) రంగులోకి మారే వరకు వేడి చేసి స్టవ్ ఆపేయాలి.. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత, అందులో మరో 5 తాజా మందార పువ్వులను వేసి రాత్రంతా అలాగే ఉంచాలి.
* ఎలా వాడాలి?: ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని వడపోసి ఒక శుభ్రమైన సీసాలో నిల్వ చేసుకోవాలి.. ఈ నూనెను రెగ్యులర్గా రాసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.
జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు.. 4 -ఆయిల్స్ హాట్ మసాజ్:
* నాలుగు రకాల (Four-Oils Blend) పోషక నూనెల కలయికతో చేసే ఈ హాట్ ఆయిల్ మసాజ్ జుట్టుకు డీప్ కండిషనింగ్ ఇస్తుంది.
* తయారీ విధానం: ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ (బాదం) ఆయిల్, జొజోబా ఆయిల్, కొబ్బరి నూనె– ఈ నాలుగింటిని ఒక్కొక్కటి 2 టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకోవాలి.. వీటన్నింటినీ కలిపి సన్నటి మంటపై బాగా వేడి చేసి, స్టవ్ ఆపి చల్లారనివ్వాలి.
* అప్లై చేసే విధానం: ఈ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే తలకు, జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత తలకు ఒక టవల్ చుట్టాలి.
* ఎన్ని సార్లు వాడాలి?: అరగంట తర్వాత టవల్ తీసేసి, మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు రాలడం తగ్గి, ఆరోగ్యంగా పెరుగుతుంది.
