డొనాల్డ్ ట్రంప్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ల నుంచి ఈ ఏడాదిలో సెప్టెంబర్ వరకూ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా షేర్లను కనీసం 44 సార్లు ట్రేడింగ్ జరిగింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెన్సన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్విడియా షేర్ల విలువ పెరిగింది. దీనివల్ల ట్రంప్ ఆస్తుల విలువ 15 మిలియన్ డాలర్ల వరకు పెరిగిన సంగతి తెలిసిందే.
భారీగా ట్రేడింగ్..
ట్రంప్ సమర్పించిన ఆర్థిక వివరాల ప్రకారం ఈ ఏడాది మొదటి 9 నెలల్లో ఆయన పోర్ట్‌ఫోలియో 5.2 మిలియన్ డాలర్ల నుంచి 17 మిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియా షేర్లను కొనుగోలు చేసింది. ఇదే సమయంలో 4.4 మిలియన్ డాలర్ల నుంచి 12 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ లావాదేవీల వివరాలను యూఎస్ ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్‌కు సమర్పించారు. ఇందులో కచ్చితమైన సంఖ్యలు కాకుండా ఒక నిర్ణీత శ్రేణిలో విలువను పేర్కొన్నారు. దీనివల్ల ట్రంప్ దగ్గర ప్రస్తుతం ఎన్ని షేర్లు ఉన్నాయి.. ఎంత ట్రేడింగ్ జరిగింది అనేది కచ్చిత వివరాలు బయటకు తెలియలేదు.
హువాంగ్ రాకతో పెరిగిన విలువ..
నవంబర్ 5న సమర్పించిన పత్రాల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి ట్రంప్ దగ్గర 3 లక్షల 70 వేల ఎన్విడియా షేర్లు ఉండే అవకాశం ఉంది. జెన్సన్ హువాంగ్ తిరిగి సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం ఎన్విడియా షేర్లు 30 శాతం పైగా పెరిగాయి. హువాంగ్ తిరిగి రావడంలో తన పాత్ర ఉందని ట్రంప్ చెప్పారు. ఎన్విడియా బోర్డుతో మాట్లాడి డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. హువాంగ్ రాక వల్ల జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని సీనియర్ ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించినట్లు ఎన్విడియా పేర్కొంది. 2025 చివరి నాటికి ట్రంప్ పోర్ట్‌ఫోలియోలో 12.5 మిలియన్ డాలర్ల నుంచి 58 మిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియా షేర్లు ఉన్నట్లు డాక్యుమెంట్లలో ఉంది.
ALSO READ : రన్ వేగా మారిన హైవే.. రహదారిపై పది విమానాలు..
వైట్ హౌస్ వివరణ..
ట్రంప్ స్టాక్, బాండ్ల పోర్ట్‌ఫోలియోను థర్డ్ పార్టీ సంస్థలు స్వతంత్రంగా నిర్వహిస్తాయని వైట్‌హౌస్ తెలిపింది. పెట్టుబడి నిర్ణయాల్లో అధ్యక్షుడికి లేదా ఆయన కుటుంబానికి ఎలాంటి ప్రమేయం ఉండదని స్పష్టం చేసింది. అయితే ఎన్విడియా నాయకత్వ మార్పులో ట్రంప్ జోక్యం చేసుకోవడం, చైనాకు చిప్ ఎగుమతులపై ప్రభుత్వం పర్యవేక్షణ ఉండటంతో ప్రయోజనాల మధ్య సంఘర్షణ తలెత్తుతోందని విమర్శలు వస్తున్నాయి. మెుత్తానికి ట్రంప్ ఎన్విడియా సీఈఓ విషయంలో చేసిన పనులు దేశం కోసమా లేక సొంత లాభాల కోసమా అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి తాజా సమాచారం బయటకు రావటంతో.
