శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న సినీ నటుడు నాగచైతన్య

 శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న సినీ నటుడు నాగచైతన్య

 ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగచైతన్య  తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. వేకువ‌జామున ఆలయానికి చేరుకున్న నాగ చైతన్యశ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

దర్శనం అనంతరం, మృత్యుంజయ స్వామి సన్నిధిలో వేద పండితులు నాగచైతన్యకు  వేద ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ అధికారులు స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు, ప్రసాదాలను, శేషవస్త్రాన్ని  కూడా అందజేశారు.

ALSO READ : అమిత్ షాను కలిసిన ‘రామాయణ’ టీమ్.. రణ్‌బీర్, సాయి పల్లవి ఫొటోలు వైరల్