జ్యోతిష్యం : ఏ తేదీల్లో పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుందో చెబుతున్న సంఖ్యా శాస్త్రం.

జ్యోతిష్యం : ఏ తేదీల్లో పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుందో చెబుతున్న సంఖ్యా శాస్త్రం.

సంఖ్యా శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం. .. ఒక్క పుట్టిన తేదీనే కాదు.. ఏ తేదీన వివాహం జరుగుతుంది.. ఆ తేదీ రాడిక్​ నంబర్​ ఎంత.. ఆ మూల సంఖ్య ఏ గ్రహాన్ని ప్రభావితం చేస్తుంది. ఏ తేదీలో పెళ్లి చేసుకుంటే వారి జీవితం ఎలా కొనసాగుతుంది.. న్యూమరాలజిస్టులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

పెళ్లి చూపులకు వెళ్లి వచ్చామో లేదో.. అమ్మాయి.. అబ్బాయి.. ఒకరికొకరు ఇష్టపడితే వెంటనే పండితుల దగ్గరికి వెళతారు.  ఇద్దరి పుట్టిన తేదీలు ఇచ్చి వీరిద్దరి దాంపత్య జీవితం ఎలా ఉంటుందోనని ఆరాతీసి అంతా ఓకే అనుకుంటేనే మిగతా కార్యాచరణ ప్రారంభిస్తారు.  

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యఘట్టం.. జీవితాంతకాలం గుర్తుండిపోయే సంతోషకరమైన విషయం. అందుకే పెళ్లి ముహూర్తాన్ని పండితులచే నిర్దేశిస్తారు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగానే  లాగే సంఖ్యాశాస్త్రం కూడా పెళ్లి తేదీలు కూడా చాలా ముఖ్యమైనవని అంటున్నారు న్యూమరాలజిస్ట్​లు.

న్యూమరాలజీ ప్రకారం  వివాహం చేసుకునే తేదీ రాడిక్స్ సంఖ్య కూడా వైవాహిక జీవితం, ప్రేమ, అనుకూలతలోని ఒడిదుడుకులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.  ఉదాహరణకు 28  వ తేదీ పెళ్లి జరిగితే ..  2 ప్లస్ 8 కలిపితే పది అవుతంది. 1 ప్లస్ 0.. వన్ అవుతుంది. రాడిక్​ సంఖ్య 1 వ అవుతుంది.

రాడిక్స్ సంఖ్య 1 :  ఏ నెలలో అయిన  1, 10, 19, 28 తేదీలకు రాడిక్​ సంఖ్య 1 అవుతుంది.  న్యూమరాలజీ ప్రకారం రాడిక్​ సంఖ్య 1 సూర్యుడిని ప్రభావితం చేస్తుంది. సూర్యుడు నాయకత్వం.. ఆత్మగౌరవం విషయంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ తేదీలలో వివాహం చేసుకున్న  దంపతులిద్దరూ తమ సొంత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల అహంభావాలు అడ్డురావడం, చిన్న చిన్న విషయాలపై కూడా అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంతాయి.  అయితే ఇద్దరూ కూర్చొని సహనం.. ఓర్పుతో చర్చించుకొని ఒక నిర్ణయానికి వస్తే వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంఖ్యశాస్త్రనిపుణులు చెబుతున్నారు

రాడిక్స్ సంఖ్య 2 :  2, 11, 20, 29 తేదీలకు రాడిక్​ సంఖ్య 2 అవుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 2 చంద్రుడికి సంబంధించినది. చంద్రుడు సామరస్యం.. ప్రేమ మొదలగు విషయాలపై తన ప్రభావాన్ని చూపుతాడు.  కాబట్టి ఈ తేదీల్లో దంపతులైన వారి దాంపత్య జీవితం చాలా సాఫీగా కొనసాగుతుంది. భార్యాభర్తల మధ్య పరస్పర శ్రద్ధ, నమ్మకం, గౌరవం అధికంగా ఉంటాయి. వారు ఎలాంటి కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ, ఇద్దరూ కలిసి నిలబడి సమస్యలను పరిష్కరించుకుంటారు.

ALSO READ : తులారాశిలో శుక్రుని గోచారం ..ఏడు రాశులవారికి స్వర్ణయుగం.. ఎప్పటివరకంటే..!

రాడిక్స్ సంఖ్య 3 :  3, 12, 21, 30 తేదీలకు రాడిక్​ నంబర్​ 3 అవుతుంది.  ఈ రాడిక్​ సంఖ్య గురుడిని సూచిస్తుంది.  జ్యోతిష్యం ప్రకారం గురుడు క్రమశిక్షణ, అభివృద్ది, సమతుల్యతను కలుగజేస్తాడు.  కాబట్టి ఈ తేదీల్లో పెళ్లి జరిగిన వారు  మరింత బాధ్యతాయుతంగా ఉంటారు, ఒకరినొకరు ఎక్కువగా గౌరవించుకుంటారు.  కుటుంబ సంతోషానికి, శాంతికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వారి వైవాహిక జీవితం సజావుగా సాగుతుంది.

రాడిక్​ సంఖ్య 4 మరియు 8 :4, 13, 22, 31 తేదీలకు రాడిక్​ సంఖ్య 4 అవుతుంది, సంఖ్యా శాస్త్రం ప్రకారం 4 రాహువుకు సంబంధించది.  రాహువు ఆవేశాన్ని కలుగజేస్తాడు.  ఈ తేదీలో వివాహం చేసుకున్నవారు ప్రతి విషయంలో కూడా ఆవేశంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  ఇక 8, 17, 26 తేదీలకు రాడిక్​ సంఖ్య 8.. సంఖ్యా శాస్త్రం ప్రకారం 8 శని గ్రహానికి సంబంధించినది. ఈ తేదీల్లో వివాహం చేసుకున్నవారికి అనేక కష్టాలు వస్తాయని న్యూమరాలజిస్ట్​లు చెబుతున్నారు. 
వీరి  వైవాహిక జీవితంలో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది.  ఈ తేదీలలో ఒక్కటైన దంపతుల మధ్య  అనవసరమైన వాదనలు, మొండితనం లేదా భావోద్వేగ దూరం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది.  కాబట్టి ప్రతి విషయాన్ని వాదించుకోకుండా పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రాడిక్​ సంఖ్య 5 మరియు 6 : న్యూమరాలజీ ప్రకారం 5, 14, 23 తేదీలకు రాడిక్​ సంఖ్య 5.. ఈ మూలసంఖ్యకు బుధుడు ఆధితపత్యం వహిస్తాడు. అలానే 6, 15, 24 తేదీలకు రాడిక్​ సంఖ్య 6 దీనికి శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. ఈ తేదీల్లో పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య ప్రేమ, విలాసవంతమైన జీవితం, పరస్పర అనుకూలత ఉంటాయి. 

రాడిక్​ సంఖ్య 7 మరియు 9:  సంఖ్యాశాస్రం ప్రకారం 7, 16, 25 తేదీల మూల సంఖ్య కేతువుకు సంబంధించిన 7.  అలానే 9, 18, 27 తేదీలకు కుజుడు ఆధిపత్యం వహించే 9 అవుతుంది, ఈ తేదీల్లో పెళ్లి చేసుకున్న వారి దంపతులు మాట్లాడుకొనే విషయంలో చాలా దృష్టి పెట్టాలి.  ఒక విషయాన్ని చర్చించేటప్పుడు ఏకాభి ప్రాయానికి చాలా కష్టం.. ప్రతి విషయంలో కూడా మిశ్రమ ఫలితాలుంటాయి. ఒకరు ఒక విషయాన్ని మరొకరు ఇంకో విషయాన్ని ఒప్పుకుంటారు.కాని చివరిలో ఎవరో ఒకరి అభిప్రాయాన్ని ఇద్దరు అంగీకరిస్తారు.  ఈ తేదీల్లో వివాహం చేసుకున్న వారి జీవితం లో కష్టాలు.. సుఖాలు ఉంటాయని సంఖ్యాశాస్త్రనిపుణులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని న్ న్యూమరాలజీ నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.