పెండ్లి ఫోటోల్లో అద్దంలా మెరిసిపోవాలి.. గెస్ట్లందరి ముందు ముఖాన చెరగని చిరునవ్వుతో, అంతే హుషారుగా కనిపించాలని ప్రతి పెండ్లి కూతురి అనుకుంటుంది. కానీ తీరా పెండ్లి రోజు వచ్చేసరికి హడావిడి, నిద్రలేమి, పనుల ఒత్తిడి కలిసి నీరసాన్ని దగ్గర చేస్తాయి. ఎంత ఖరీదైన మేకప్ వేసినా, లోపల ఎనర్జీ డౌన్ అయితే ఆ కళ ఫోటోల్లో కనపడదు. దీనికి అసలు కారణం పెండ్లికి ముందు రోజు నుంచే సరైన ఫుడ్ తీసుకోకపోవడమే అంటున్నారు న్యూట్రిషనిస్ట్ నియామి అగర్వాల్ (Niyami Agarwal). వెడ్డింగ్ డే నాడు డల్‌నెస్‌కు చెక్ పెట్టి, రోజంతా ఫుల్ ఎనర్జిటిక్‌గా, ఫ్రెష్‌గా కనిపించేందుకు ఆమె చెబుతున్న సింపుల్ డైట్ ప్లాన్ ఇవే..
బిస్కెట్లు, జంక్ ఫుడ్ వద్దు.. నట్స్, సీడ్స్‌తో నేచురల్ గ్లో:
* పెండ్లి హడావిడిలో టైమ్‌కు సరిగ్గా భోజనం చేయలేక, ఆకలి వేసినప్పుడల్లా చాలామంది హై-క్యాలరీ బిస్కెట్లు, స్నాక్స్ తింటుంటారు. ఇది స్కిన్‌కు, ఎనర్జీకి అస్సలు మంచిది కాదు.
* ఒమెగా-3 పవర్: బిస్కెట్లకి బదులు బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. వీటిలోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని, వెంట్రుకలను ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచుతాయి.
* నీళ్లు మర్చిపోవద్దు: పనుల హడావిడిలో పడి చాలామంది వెడ్డింగ్ డే రోజున సరిపడా నీళ్లు తాగరు. డీహైడ్రేషన్ వల్ల ముఖం వెంటనే డల్‌గా మారిపోతుంది. మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉంటే రోజంతా ఫ్రెష్‌గా కనిపిస్తారు.
బొప్పాయి, పెరుగు, చియా సీడ్స్ వాటర్ బెటర్:
* పెళ్లి రోజున డైజెషన్ సరిగ్గా లేకపోయినా, కడుపులో ఇబ్బందిగా ఉన్నా ఆ నీరసం ముఖంలో ఇట్టే కనిపిస్తోంది.
* బొప్పాయి, చియా సీడ్స్: పెండ్లికి ముందు రోజు నుంచే జీర్ణక్రియ సాఫీగా కొనసాగడానికి బొప్పాయి తినాలి. అలాగే చియా సీడ్స్ వేసిన ఒక గ్లాస్ నీళ్లు తాగితే యాక్టివ్‌గా ఉంటారు.
* పెరుగు తప్పనిసరి: డైట్లో ఖచ్చితంగా పెరుగు చేర్చుకోవాలి.. దీనివల్ల ఎనర్జీని ఇచ్చే క్యాల్షియం, ప్రొటీన్లు అందుతాయి.
మేకప్ కంటే మించిన మెరుపు.. వెజిటబుల్ జ్యూస్:
* పెండ్లికి ముందు రోజుల్లో డైట్లో ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తప్పనిసరిగా ఉండాలి..
ALSO READ : ఏ తేదీల్లో పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుందో చెబుతున్న సంఖ్యా శాస్త్రం.
* ముఖ్యంగా క్యారెట్లు, బీట్రూట్, టొమాటోలతో తయారు చేసిన జ్యూస్ తాగితే చర్మం లోపలి నుంచే తళుక్కున మెరుస్తుంది.
