సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా అంటేనే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అందుకే డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంటారు తలైవా. ఇటీవలే జైలర్ 2తో బ్లాక్ బస్టర్ కొట్టి, తన 173వ సినిమా ‘ధర్మన్’పై మరింత ఫోకస్ పెట్టారు. అయితే ఈ సినిమా కథకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ వైరల్ అవుతుంది. ప్రముఖ జపనీస్ యానిమే సిరీస్ ‘మాన్స్టర్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనే టాక్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
డాక్టర్ పాత్రలో రజినీకాంత్?
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ ఒక్క విషయం బయటకు రావడంతో ‘ధర్మన్’ కథకు, 2004-2005 మధ్య వచ్చిన జపనీస్ యానిమే సిరీస్ ‘మాన్స్టర్’కు సంబంధం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ సిరీస్‌లోనూ ఓ డాక్టర్ చుట్టూనే కథ తిరుగుతుంది. దీంతో అభిమానులు ఈ రెండు కథల మధ్య పోలికలను వెతుకుతున్నారు.
అసలు ‘మాన్స్టర్’ కథేంటి?
‘మాన్స్టర్’ సిరీస్‌లో ఓ నిజాయితీపరుడైన న్యూరోసర్జన్ జీవితంలో ఎదురయ్యే నైతిక సంఘర్షణే మెయిన్ స్టోరీ. ఒకానొక సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నగర మేయర్‌కు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అదే సమయంలో తీవ్ర గాయాలతో ఓ చిన్న పిల్లాడు ఆసుపత్రికి వస్తాడు. ఎవరికి ముందుగా ఆపరేషన్ చేయాలనే ప్రశ్న డాక్టర్ ముందుకొస్తుంది. చివరకు మేయర్‌ను కాదని ఆ చిన్నారికి చికిత్స చేసి అతడి ప్రాణాలను కాపాడతాడు. అయితే మేయర్ మరణించడంతో డాక్టర్ కెరీర్‌లో సమస్యలు మొదలవుతాయి.
కానీ అసలు కథలో ట్విస్ట్ ఆ చిన్నాడు పెద్దయ్యాక మొదలవుతుంది. అతడే ఓ సీరియల్ కిల్లర్‌గా మారి వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. మరోవైపు, అతడిని కాపాడిన డాక్టరే ఈ పరిణామాలకు కారణమయ్యాడనే భావనతో కథలో ఉత్కంఠ పెరుగుతుంది. తన నిర్ణయం వల్ల జరిగిన పరిణామాలను ఎదుర్కొంటూ, నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు డాక్టర్ చేసే పోరాటమే ఈ సిరీస్‌లో కీలకమైన అంశం.
Superstar #Rajinikanth కొత్త సినిమా #Dharman కథపై సోషల్ మీడియాలో ఆసక్తికర రూమర్స్! 👀 ప్రముఖ జపనీస్ యానిమే #Monster ఆధారంగా ఈ కథ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆ కథ ఏంటంటే: ఒక నిజాయితీ గల న్యూరోసర్జన్ జీవితం ఒకే ఒక్క నిర్ణయంతో తలకిందులవుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నగర మేయర్‌కు అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అదే సమయంలో, తీవ్ర గాయాలతో ఉన్న ఒక చిన్న పిల్లాడు ఆసుపత్రికి వస్తాడు. మేయర్ కంటే ముందు ఆ చిన్న పిల్లాడికి సర్జరీ చేసి ప్రాణాలు కాపాడతాడు. ఆ పిల్లాడు బతుకుతాడు కానీ మేయర్ మరణిస్తాడు. దీంతో న్యూరోసర్జన్‌పై 10 ఏళ్ల నిషేధం పడుతుంది. అసలు ట్విస్ట్ పదేళ్ల తర్వాత మొదలవుతుంది. పదేళ్ల తర్వాత ఆ పిల్లాడే సీరియల్ కిల్లర్‌గా మారి, తాను చేసే ప్రతి హత్యకు ఆ డాక్టర్నే ఇరికిస్తుంటే.. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి డాక్టర్ చేసే పోరాటమే ఈ కథ అని టాక్. కానీ, ఇదంతా రూమర్ మాత్రమే అనిపిస్తోంది. ఎందుకంటే BTS విజువల్స్‌లో రజినీకాంత్, రామ్ పోతినేని మామ-అల్లుళ్లుగా కనిపిస్తున్నారు. పైగా, 'ధర్మన్' సినిమా 'నరసింహ' (#Padaiyappa), 'రాఘవన్' (#VettaiyaaduVilaiyaadu) చిత్రాలను మిక్స్ చేసినట్టుగా ఉంటుందని దర్శకుడు అశ్వత్ మారిముత్తు ముందే చెప్పారు. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం అనేది సినిమాలోనే చూడాలి! 🔥🎬 #SuperStarRajinikanth #RamPothineni
— Journalist Ramesh Pammy (@rameshpammy) November 25, 2026
‘మాన్స్టర్’ రీమేక్ కాదా?
రజినీకాంత్ డాక్టర్ పాత్రలో నటిస్తున్నారనే టాక్ తప్ప.. ఈ సినిమా ‘మాన్స్టర్’ ఆధారంగా రూపొందుతోందని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. పైగా, ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెరపైకి వచ్చింది. సినిమా బీటీఎస్ విజువల్స్‌లో రజినీకాంత్, రామ్ పోతినేని మామా అల్లుళ్లుగా కనిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
అంతేకాదు.. దర్శకుడు అశ్వత్ మారిముత్తు గతంలోనే ‘ధర్మన్’ కథ ‘నరసింహ’ (పడయప్ప), ‘రాఘవన్’ (వెట్టైయాడు విలైయాడు) సినిమాల కలయికలా ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో ‘మాన్స్టర్’ కథతో పోలికలు నిజమేనా? లేక సినిమాలోని డాక్టర్ పాత్ర కారణంగా అభిమానులు ఈ అంచనాలకు వస్తున్నారా? అనే ఆసక్తి నెలకొంది.
కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోగా, సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరి ‘ధర్మన్’ కథ వెనుక అసలు రహస్యం ఏంటనేది తెలియాలంటే టీజర్ రావాల్సిందే.. అంతవరకు వరకు తలైవా ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే..!
