BHOGI Review: ‘భోగి’ రిజల్ట్ ఇలా ఉందేంటి? శర్వానంద్ సినిమాపై పబ్లిక్ టాక్ ఇదే..

BHOGI Review: ‘భోగి’ రిజల్ట్ ఇలా ఉందేంటి? శర్వానంద్ సినిమాపై పబ్లిక్ టాక్ ఇదే..

టీజర్, ట్రైలర్‌లోని రా అండ్ రస్టిక్ విజువల్స్.. శర్వానంద్ ఊరమాస్ లుక్.. పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసింది ‘భోగి’ (BHOGI). ఇప్పటివరకు క్లాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో అలరించిన శర్వానంద్.. ఈసారి పూర్తిగా మాస్ అవతారంలో కనిపించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. దీనికితోడు ‘రంగస్థలం’ తరహా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో అంచనాలు మరింత పెరిగాయి.

నవంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలి షోల తర్వాత సోషల్ మీడియాలో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంటోంది. శర్వానంద్ నటన, మాస్ యాక్షన్ సన్నివేశాలకు ప్రశంసలు దక్కుతుండగా.. రొటీన్ కథనం, మితిమీరిన హింస, నెమ్మదిగా సాగే కథనం, చెవులు చిల్లులు పడేలా ఉన్న బీజీఎంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ‘భోగి’ కథేంటి? శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటన ఎలా ఉంది? సంపత్ నంది తన మార్క్ చూపించారా? సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌లో నెటిజన్ల స్పందన ఎలా ఉంది? తెలుసుకుందాం..

భోగి కథేంటి?

1962 నాటి ఆదిలాబాద్ గిరిజన ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. అక్కడి ప్రజలను అణచివేస్తూ, తన అరాచకాలతో భయభ్రాంతులకు గురిచేసే ఓ క్రూరమైన నాయకుడికి వ్యతిరేకంగా గంగ (శర్వానంద్) తిరుగుబాటు చేయడం చుట్టూ కథ తిరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో జరిగే అన్యాయాలు, వాటి వెనుక ఉన్న ఆధిపత్య పోరు, ప్రతీకారం వంటి అంశాలను దర్శకుడు కథలో భాగం చేశారు.

గ్రామం, అక్కడి విలన్, అతడి వల్ల హీరో కుటుంబానికి జరిగే అన్యాయం, ఆ తర్వాత హీరో చేసే పోరాటం.. ఇలా రివెంజ్ డ్రామా తరహాలో కథను నడిపించారు. అయితే ఈ కథాంశం, గ్రామీణ నేపథ్యం చూసిన కొందరు ప్రేక్షకులకు ‘రంగస్థలం’ గుర్తుకొస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంపత్ నంది మ్యాజిక్ మిస్సైందా?

దర్శకుడు సంపత్ నంది 1960ల గ్రామీణ నేపథ్యంలో ఆధిపత్య పోరు, ప్రతీకారం వంటి అంశాలతో ‘భోగి’ని తెరకెక్కించారు. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, ‘రంగస్థలం’ ఛాయలు కనిపించడం, బలహీనమైన స్క్రీన్‌ప్లే కారణంగా ఆయన మార్క్ మిస్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని యాక్షన్ సన్నివేశాలు, క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.

ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. 

‘భోగి’ సినిమాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రొటీన్ రివెంజ్ కథ, అర్థంపర్థం లేని కథనం, విసుగు పుట్టించే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను నిరాశపరిచాయని ఓ రివ్యూలో పేర్కొన్నారు. ముఖ్యంగా సెకండాఫ్, క్లైమాక్స్ దారుణంగా ఉన్నాయని, మితిమీరిన హింస, చెవులు చిల్లులు పడే బీజీఎం సినిమాకు మైనస్‌గా మారాయని విమర్శించారు. అయితే శర్వానంద్ నటన, సినిమాటోగ్రఫీ, కొన్ని డైలాగులు మాత్రమే చెప్పుకోదగ్గ అంశాలని ప్రశంసించారు. మొత్తంగా ఈ ఏడాదిలో వచ్చిన అత్యంత నిరాశపరిచిన చిత్రాల్లో ‘భోగి’ ఒకటని రివ్యూయర్ అభిప్రాయపడ్డారు.

శర్వానంద్ నటన ఎలా ఉంది?

‘భోగి’లో శర్వానంద్ తన రస్టిక్ మాస్ లుక్‌తో ఆకట్టుకున్నారు. గంగ పాత్రలో ఆయన మేకోవర్, తెలంగాణ యాస, యాక్షన్ సన్నివేశాల్లో ఎనర్జీకి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా మాస్ ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టారని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. అయితే బలహీనమైన కథనం కారణంగా ఆయన పెర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో ఎలివేట్ కాలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

అనుపమ, డింపుల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?

అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి తమ పాత్రల పరిధిలో నటించినప్పటికీ, హీరోతో పోలిస్తే వీరికి తక్కువ ప్రాధాన్యత దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అనుపమ పాత్రకు తగిన స్క్రీన్ స్పేస్ లేదని కొందరు అంటున్నారు. డింపుల్ హయాతి మాత్రం తన పాత్రలో ఆకట్టుకున్నారని మరికొందరు ప్రశంసిస్తున్నారు. సినిమాలో ఐదుగురు అక్కాచెల్లెళ్ల ఎమోషన్‌ను చూపించే ప్రయత్నం చేసినప్పటికీ, అందరికీ సమానమైన ప్రాధాన్యత దక్కలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

టెక్నీకల్ అంశాలు..

భోగి’లో దిలీప్ సుబ్బరాయన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు, శర్వానంద్ మాస్ ఎలివేషన్స్ ఆకట్టుకుంటున్నాయి. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన సాంగ్స్ సినిమా రిలీజ్ కు ముందే ఓ ఊపు ఊపేసినప్పటికీ.. బీజీఎంపై మాత్రం మిక్సెడ్ టాక్ వస్తోంది. కొన్ని చోట్ల బాగున్నప్పటికీ, మరికొన్ని సన్నివేశాల్లో లౌడ్‌గా ఉందనే విమర్శలు వస్తున్నాయి. అయితే, 1960ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించే విజువల్స్, ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీకి ప్రశంసలు దక్కుతున్నాయి.

ALSO READ : విరూపాక్షలో కాకులు.. వృషకర్మలో గబ్బిళాలు.. స్టోరీ ఇదే!

ఫైనల్‌గా భోగి ఎలా ఉంది?

మొత్తంగా ‘భోగి’కి తొలి షోల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. శర్వానంద్ మాస్ లుక్, నటన, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తుండగా.. రొటీన్ కథనం, బలహీనమైన స్క్రీన్‌ప్లే, హీరోయిన్ల పాత్రలకు తక్కువ ప్రాధాన్యత మైనస్‌లుగా మారాయి. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే కొన్ని అంశాలున్నప్పటికీ, కొత్తదనం, బలమైన ఎమోషన్స్ కోరుకునే ప్రేక్షకులను మాత్రం ‘భోగి’ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది.