ఆధ్యాత్మికం: ఉసిరి చెట్టు కింద భోజనం.. ఎన్నో ఉపయోగాలు.. ఆరోగ్య రహస్యం ఇదే..!

ఆధ్యాత్మికం: ఉసిరి చెట్టు కింద భోజనం.. ఎన్నో ఉపయోగాలు.. ఆరోగ్య రహస్యం ఇదే..!

కార్తీకమాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడవుందా జనాలు ఎతుకుతూ ఉంటారు. పూజలకు ఎంత విశిష్టత ఉందో..కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలకు కూడా అంత ప్రాధాన్యత ఉంది.  అయితే నేటి యువత పిక్​నిక్​ పేరుతో నానా రచ్చ చేస్తున్నారు. ఇలా చేయడం వలన ఉపయోగం లేకపోగా అనేకనష్టాలు కూడా ఉన్నాయి.  అసలు కార్తీకమాసంలో ఎందుకు ఉసిరి చెట్టుకింద భోజనం చేయాలి.. అలా చేయడం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి..దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం... !

కార్తీకమాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం జనాలు తోటలు ఎతుక్కుంటున్నారు.  దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎంతో పవిత్రమైన ఈ కార్యక్రమము కులాలవారీగా జరుపుకుంటున్నారు. కాని అలా కాకుండా పురాణాల్లో కార్తీకమాసం వనభోజనాల గురించి ప్రత్యేకంగా రుషులు చెప్పారు.  అందుకే పెద్దలు ..  అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకువెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు. 

కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ ఉసిరి చెట్టులో  కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగాను కూడా  కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో క్షీర సముద్రం చిలికే సమయంలో అమృతం వెలువడిన తరువాత దానికి కోసం.. రాక్షసులు కొట్టుకున్న సమయంలో  కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద పడటంతో ఉసిరి పుట్టిందని .. అదిసకల మానవాళిని రక్షిస్తుందనీ   పండితులు చెడుతున్నారు.  

ఆయుర్వేద వైద్యం ప్రకారం..  వృద్దాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధం ఈ  మొక్కలలో ఉందని ..  ఉసిరికి ఉసిరే సాటి అని చెపుతుంది చరకసంహిత. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు.

సూత మహర్షి మునులందరితో కూడి నైమిశారణ్యంలో కార్తీకమాసంలో ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడినది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కల్గిన వృక్షం.  అంతేకార ఇది  దామోదరునికి (శ్రీహరికి) అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడలో చేయాలని పండితులు చెబుతున్నారు. 

 వనభోజనాల ప్రారంభానికి ముందు, ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి, పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలసి వనభోజనాలను చేయాలి. అవకాశాన్ని బట్టి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మరీ మంచిది.  

శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడి తో,  తోటి గోప బాలకులతో కలసి బృందావనంలో  యమునా నదీ తీరంలో  ఉసిరి, ఇతర ఔషధ  వృక్షాల నీడలో  వనభోజనాలను చేసాడని భాగవతంలో చెప్పబడినది.  ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.

ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి  ఎంతో ఇష్టమైనది.  ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి. బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడం వనభోజనాలుగా ప్రసిద్ధిచెందింది. ఉసిరి చెట్టుమీద ఈ కార్తీక మాసంలో నారాయణుడుంటాడనీ అందుకనే ఆ చెట్టుని ధాత్రీ నారాయణుడుగా భావించి పూజ చెయ్యాలనీ శాస్త్రాల ద్వారా తెలుస్తుంది.

ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి.  ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చెయ్యాలని పెద్దలు అంటుంటారు.  ఈ కాలంలోనే ఉసిరి కాయలు బాగా వస్తాయి. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవినిలాంటిది. రోజూ ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి.షడ్రుచులలోని చేదు తప్ప మిగతా ఐదు రుచులు వున్నాయి. ఇది మన జీర్ణశక్తిని కాపాడుతుంది. మన శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది. శరీరంలో సమతుల్యం తీసుకువస్తుంది. ఈ చెట్టుగాలి కూడా చాలా మంచిది. అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు, పూజలు, ప్రదక్షిణలు, వన భోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టుదగ్గర గడపాలని చెబుతారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.