నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈసీఐఎల్‌లో 242 అప్రెంటిస్ ఖాళీలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈసీఐఎల్‌లో 242 అప్రెంటిస్ ఖాళీలు

కేంద్ర అణుశక్తి విభాగం పరిధిలో పనిచేస్తున్న మినీ రత్న కేటగిరీ–-1 హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) గ్రాడ్యుయేట్ ఇంజినీర్, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024, ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత ఉత్తీర్ణులైన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఆన్‌లైన్‌ ద్వారా డిసెంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 242.
విభాగాల వారీగా ఖాళీలు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ (జీఈఏ) 200, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ (టీఏ) 42. 
విద్యార్హతలు
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ (జీఈఏ): ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుంచి ఈసీఈ, సీఎస్ఈ/ ఐటీ, మెకానికల్, ఈఈఈ, ఈఐఈ, సివిల్, కెమికల్ విభాగాల్లో బీఈ / బి.టెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ (టీఏ): గుర్తింపు పొందిన సాంకేతిక విద్యా మండలి నుంచి ఈసీఈ, సీఎస్ఈ/ ఐటీ, మెకానికల్, ఈఈఈ, ఈఐఈ, సివిల్, కెమికల్ విభాగాల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
వయసు: 2026, డిసెంబర్ 31 నాటికి 25 ఏళ్లు మించకూడదు. 
ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 24.
లాస్ట్ డేట్: డిసెంబర్ 13. 
డాక్యుమెంట్ వెరిఫికేషన్: డిసెంబర్ 17 నుంచి 19 వరకు. 
స్టైఫండ్: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ (జీఈఏ)కు రూ.12,300,  టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ (టీఏ)లకు రూ.10,900 చెల్లిస్తారు. 
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రూట్నీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ పోస్టులకు అర్హత గల బీఈ/ బి.టెక్​, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు మూడేళ్ల డిప్లొమాలో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా ఈసీఐఎల్ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ ecil.co.inను సందర్శించండి.
– వెలుగు, ఎడ్యుకేషన్