నవంబర్ 27న యథావిధిగా మూసాపేట లేఅవుట్‌‌ ఈ–వేలం

నవంబర్ 27న  యథావిధిగా మూసాపేట లేఅవుట్‌‌ ఈ–వేలం

హైదరాబాద్ సిటీ, వెలుగు: కూకట్‌‌పల్లి పరిధిలోని మూసాపేట లేఅవుట్‌‌ ఈ-వేలం శుక్రవారం యథావిధిగా నిర్వహించనున్నట్లు హెచ్‌‌ఎండీఏ అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూసాపేట లేఅవుట్‌‌లోని సర్వే నంబర్లు 121/పీ నుంచి 141 వరకు, 146, 147, 155 నుంచి 157 పరిధిలోని 3 ఎకరాల 15 గుంటల భూమి ఈ-వేలంపై కూకట్‌‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ట్రక్‌‌ అసోసియేషన్‌‌, మరికొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ మేరకు 39957/2026, 39813/2026 రిట్‌‌ పిటిషన్లతో పాటు పిల్‌‌ నంబర్లు 37, 38/2026 దాఖలయ్యాయి. అయితే, న్యాయస్థానం ఎలాంటి మధ్యంతర స్టే ఇవ్వలేదని, ప్రకటించిన షెడ్యూల్‌‌ ప్రకారం వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌‌లో  మార్పు లేదని స్పష్టం చేశారు.