- ప్రభుత్వ డాక్టర్ల సంఘం ఈఎస్‌ఐ అధ్యక్షుడు డా.చీమ శ్రీనివాస్
బషీర్‌బాగ్, వెలుగు : తెలంగాణ ఈఎస్‌ఐ వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం ఈఎస్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు డా. చీమ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈఎస్‌ఐసీ ప్రతిపాదిస్తున్న సొసైటీ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో 70 ఏళ్లుగా కొనసాగుతున్న ఈఎస్‌ఐ వైద్య వ్యవస్థ ద్వారా కోటి మందికి పైగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలందుతున్నాయని తెలిపారు.
రామచంద్రాపురం, నాచారం ఈఎస్‌ఐ దవాఖానలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకెళ్లే ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. ఏడేళ్లుగా ఈఎస్‌ఐ డైరెక్టర్‌గా డాక్టర్‌ను నియమించకపోవడంతో పరిపాలనాపరంగా, వైద్య సేవల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు డా. సీహెచ్. కళ్యాణ్, ప్రధాన కార్యదర్శి డా. యు. ఆదిత్య, కమిటీ సభ్యులు డా. రవి, డా. సుజాత, డా. శ్రవణ్ రెడ్డి, డా. రాచన్న, డా. షరాన్ థామస్, డా. ఖాజా మొయినుద్దీన్, డా. సుధీర్, డా. లోకేష్, డా. నాగరాజు, డా. సతీష్, డా. నరేందర్ పాల్గొన్నారు.
