న్యూయార్క్/ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 16న స్వదేశానికి తిరిగి రానున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. హసీనాకు ఏదైనా హాని జరిగితే అందుకు ప్రస్తుత ప్రధాని తారిఖ్ రెహమాన్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ హెచ్చరించారు.
న్యూయార్క్‌లో ‘బంగ్లాదేశ్ భవిష్యత్’ అనే అంశంపై జరిగిన సదస్సులో రూబిన్ మాట్లాడుతూ, ‘షేక్ హసీనా ఎలాంటి హాని జరిగినా అందుకు ప్రధాని తారిఖ్, ఆయన ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బంగ్లాదేశ్ అధికారులతో ఎలాంటి రాజీ పడకుండా భారత్ దృఢంగా నిలబడాలి" అని పిలుపునిచ్చారు.
