పంజాగుట్ట, వెలుగు ; పంజాగుట్టలోని జీవీకే మాల్లో బాంబు ఉందంటూ డయల్100 కు ఓ ఆగంతకుడు ఫోన్చేయడంతో షాపింగ్మాల్నిర్వాహకులు, వినియోగదారులు భయ భ్రంతాలకు గురయ్యారు. వెంటనే వచ్చిన బాంబ్ స్వ్కాడ్ రెండు గంటల పాటు తనిఖీలు చేసి అంతా ఉత్తదేనని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ కాల్వచ్చిన నంబర్ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
