Vaibhav Sooryavanshi: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ (Rising Stars Asia Cup) 2026 సెమీఫైనల్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) నుంచి మరో సునామీ ఇన్నింగ్స్ ఆశించిన ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. ఈరోజు (2026, నవంబర్ 26, గురువారం) శ్రీలంక-A (Sri Lanka A)తో జరుగుతున్న మొదటి సెమీఫైనల్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ 27 బంతుల్లో 40 పరుగులకే ఔటయ్యాడు. జట్టుకు మంచి శుభారంభం అందించినప్పటికీ, జనిత్ లియనాగే (Janith Liyanage) బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకోవడంతో భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశాన్ని కోల్పోయాడు.
గత మ్యాచ్‌లో 204.. ఈ మ్యాచులో 40కే ఔట్:
* యూఏఈపై విశ్వరూపం: గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో యూఏఈపై వైభవ్ సూర్యవంశీ కేవలం 53 బంతుల్లోనే 204 నాటౌట్ (28 సిక్సర్లు, 7 ఫోర్లు) కొట్టి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు. అతడి విధ్వంసంతో 250 పరుగుల లక్ష్యాన్ని భారత్-A 14.2 ఓవర్లలోనే ఛేదించింది.
* లంక వ్యూహం ఫలించింది: ఆ ఇన్నింగ్స్ తర్వాత సెమీఫైనల్లో వైభవ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన శ్రీలంక-A బౌలర్లు, వైభవ్ క్రీజులో ఎక్కువ సేపు నిలదొక్కుకోకుండా కట్టడి చేశారు. జనిత్ లియనాగే అతడి వికెట్ తీసి లంకకు బ్రేక్ త్రూ అందించాడు.
భారీ స్కోరుగా మలచాల్సిన బాధ్యత మిడిలార్డర్‌పైనే:
సెంచరీ, డబుల్ సెంచరీ స్థాయి ఇన్నింగ్స్ ఆడలేకపోయినప్పటికీ, నాకౌట్ మ్యాచ్‌లో వైభవ్ చేసిన 40 పరుగులు భారత్-Aకు మంచి పునాది వేశాయి. ఫైనల్ బెర్త్ ఖరారు కావాలంటే, వైభవ్ అందించిన ఈ ఆరంభాన్ని మిగిలిన భారత బ్యాటర్లు భారీ స్కోరుగా మలచాల్సిన అవసరం ఉంది.
* అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఇన్నింగ్స్ స్టార్టింగ్ లో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ, వైభవ్ ఔట్ అయినా తర్వాత బ్యాట్ ఝలిపించాడు. 11 ఫోర్లు, ఒక సిక్స్ తో 78 పరుగులు చేసి లహిరు సమరకోన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేయగా, కుషాగ్రా (21) కాసేపటికే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం భారత జట్టు 34 ఓవర్లలో 207 పరుగులకి కీలకమైన 4 వికెట్లని కోల్పోయింది. క్రీజులో రింకు సింగ్ (2* ), షహబాజ్ అహ్మద్( 2*) ఉన్నారు.
🚨 VAIBHAV SOORYAVANSHI THROWS HIS WICKET AWAY AGAINST SRI LANKA🚨 After making headlines with his unbelievable batting performances, everyone was expecting another big innings from the young Indian sensation....See more https://t.co/VcSpLpmXn5
— Aarya 🕊️ (@Vitamin_Vk18) November 26, 2026
