26/11 Mumbai Attacks: 26/11 ముంబై ఉగ్రదాడి (Mumbai Terror Attacks) జరిగి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు ( గురువారం, నవంబర్ 26, 2026) దేశవ్యాప్తంగా బాధితులు, వీరులను స్మరించుకుంటున్నారు. ముంబై చరిత్రలో అత్యంత విషాదకర ఘట్టాల్లో ఒకటైన ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని, ఆపదలో తోడ్పడిన వారి నిస్వార్థ ధైర్యాన్ని క్రీడాలోకం గుర్తు చేసుకుంది. మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా (Pragyan Ojha), ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.
భయాన్ని దయతో ఎదుర్కొన్న వారికి సలాం: ప్రజ్ఞాన్ ఓజా
టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా X (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారితో పాటు కష్టకాలంలో అండగా నిలిచిన సామాన్య పౌరులకి హ్యాట్సాఫ్.. తమ తలుపులు తెరిచి, చేతనైన సాయం చేసి, ఎప్పుడూ కలవని వ్యక్తుల పక్కన నిలబడ్డారు. వారి నిశ్శబ్ద ధైర్యానికి ఘన నివాళులు అర్పిస్తున్నామని ఓజా పోస్ట్ చేశారు.
వారి ధైర్యం, త్యాగాలకు నివాళి.. ముంబై ఎమోషనల్ పోస్ట్:
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కూడా X వేదికగా 26/11 వీరులను స్మరించుకుంది. వారి ధైర్యం, త్యాగాలకు నివాళి (Honouring their courage and sacrifices) అనే సందేశంతో ముంబై ఇండియన్స్ నివాళి అర్పించింది. 18 ఏళ్లు గడిచినా ఆ ఘటన తాలూకు జ్ఞాపకాలు ముంబై ప్రజల మనసుల్లో పదిలంగా ఉన్నాయని పేర్కొంది.
On 26/11, we remember the lives we lost and pay tribute to those who met fear with kindness. They opened their doors and offered help where they could and stayed beside people they had never met. Today, we honour their quiet courage with deep gratitude. 🙏
— Pragyan Ojha (@pragyanojha) November 26, 2026
Honouring their courage and sacrifices 🇮🇳 भावपूर्ण श्रद्धांजली 🙏 📸: @ompsyram https://t.co/wDNW3iljGG
— Mumbai Indians (@mipaltan) November 26, 2026
