ప్రభుత్వ పురుష ఉద్యోగులకు సీఎం విజయ్ గుడ్ న్యూస్

ప్రభుత్వ పురుష ఉద్యోగులకు సీఎం విజయ్ గుడ్ న్యూస్

చెన్నై: తమిళనాడులోని పురుష ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం విజయ్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని పురుష ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులను ప్రకటించారు. వివాహితులైన పురుష ప్రభుత్వ ఉద్యోగులు బిడ్డ పుట్టే తేదీకి 15 రోజుల ముందు నుంచి లేదా బిడ్డ పుట్టిన ఆరు నెలల లోపు ఈ సెలవులను వాడుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. 

ప్రసవ సమయంలో తల్లి, నవజాత శిశువు ఇద్దరికీ తండ్రి తోడుగా ఉండటం ముఖ్యమని పేర్కొంది. తల్లికి శారీరక, మానసిక మద్దతు అందించడానికి, శిశువు సంరక్షణలో సహాయపడటానికి తండ్రి సమక్షం అవసరమని వెల్లడించింది. కాగా, తమిళనాడులో పురుష ఉద్యోగులకు పితృత్వ సెలవులు ఇవ్వడం ఇదే తొలిసారి.

రాష్ట్రంలో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 365 రోజుల ప్రసూతి సెలవులు ఉన్న విషయం తెలిసిందే. తమకు కూడా పితృత్వ సెలవులు కావాలని పురుష ఉద్యోగులు కొంతకాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. వారి విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఈ మేరకు 15 రోజుల సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ ప్రయోజనాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయంపై పురుష ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.