హైదరాబాద్: గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ పరిధిలో సెస్నా-152 శిక్షణ విమానం కుప్పకూలింది. ల్యాండింగ్ సమయంలో విమానం చెట్టును ఢీకొనడంతో ట్రైనీ పైలట్ అనుష్క బజ్పాయ్ (23), ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ కెప్టెన్ ఎం. ప్రశాంత్ కుమార్ (30) తలకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
