2వ రోజూ పెరిగిన బంగారం.. 10 రోజుల తర్వాత వెండి కేజీకి ఎన్ని వేలు పెరిగిందంటే?

2వ రోజూ పెరిగిన బంగారం.. 10 రోజుల తర్వాత వెండి కేజీకి ఎన్ని వేలు పెరిగిందంటే?

ఇటీవలి కాలంలో భారీగా తగ్గిన బంగారం, వెండి రేట్లకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. ప్రధానంగా 10 రోజుల పాటు వరుస పతనం తర్వాత వెండి రేటు కేజీకి రూ.5వేలు పెరిగింది. ఇకపోతే వరుసగా రెండో రోజున కూడా బంగారం సామాన్యులకు షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో కార్తీక శుక్రవారం రోజున షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం బెటర్. 

హైదరాబాద్ లో 2026, నవంబర్ 27వ తేదీ బంగారం ధరలు ఇలా ఉన్నాయి :

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : లక్షా 26 వేల 550 రూపాయలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : లక్షా 16 వేల రూపాయలు
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : 94 వేల 910 రూపాయలు

ఇక వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్ సిటీలో కిలో వెండి : లక్షా 70 వేల రూపాయలు

నవంబర్ 27న బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాముకు 1,750 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.12వేల 655గా కొనసాగుతోంది. శుక్రవారం రోజున రూ.లక్షా 26వేల 550కి చేరుకుంది. అలాగే ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.11వేల 600గా కొనసాగుతోంది. అంటే 10 గ్రాముల బంగారం రేటు అంటే తులం రూ.లక్షా 16 వేల వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 27, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.లక్షా 70వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.170 దగ్గర ఉంది.