యూఎస్తో త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలి.. 17 శాతం సుంకంతో మన ఎగుమతులకు కొంత మేలే

యూఎస్తో త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలి.. 17  శాతం సుంకంతో మన ఎగుమతులకు కొంత మేలే
  • ప్రభుత్వానికి తెలిపిన ఎగుమతిదారులు

న్యూఢిల్లీ: అమెరికాతో వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందాన్ని (బీటీఏ) కుదుర్చుకోవాలని భారత ఎగుమతిదారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌) నివేదికలో ప్రతిపాదించిన 17 శాతం సుంకం భారత ఉత్పత్తులకు ఇతర దేశాలతో పోలిస్తే కొంత మేలని ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ ఆర్గనైజేషన్స్‌‌‌‌‌‌‌‌ (ఫియో) అధ్యక్షుడు  రహలన్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ప్రస్తుతం అమెరికా నుంచి భారత ఎగుమతిదారులకు మంచి ఆర్డర్లు వస్తున్నాయని,  ఒప్పందం కుదిరితే మరిన్ని వస్తాయని చెప్పారు. 

వాణిజ్య ఒప్పందం లేకపోతే  ఇప్పటికే ఉన్న కొనుగోలుదారులను నిలుపుకోవడం కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందం భారత్‌‌‌‌‌‌‌‌ దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని, ఇతర దేశాల సరఫరాదారులతో సమానంగా పోటీపడే అవకాశం కల్పించాలని సూచించారు.  ఉత్పత్తుల వారీగా ఇచ్చే మినహాయింపులపై స్పష్టత అవసరమన్నారు. అప్పుడే ఎగుమతిదారులు ధరలను ధైర్యంగా నిర్ణయించగలరని చెప్పారు. 

ఎంఎస్​ఎంఈలపై భారం లేకుండా చూడండి

 తక్కువ లాభాలతో పనిచేసే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై (ఎంఎస్​ఎంఈ) అదనపు సుంకాలు,  నిబంధనల భారం పడకుండా చూడాలని ఫియో కోరింది. ప్రతి రంగంపై ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం పరిశ్రమలతో చర్చలు జరపాలని సూచించింది. కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ లెదర్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రమేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ జునేజా కూడా 17 శాతం సుంకం విధింపు భారత్‌‌‌‌‌‌‌‌కు మంచి ఒప్పందమని  అభిప్రాయపడ్డారు.