- డిసెంబర్ 2 వరకు చెల్లించే చాన్స్స్పెషల్ టెట్ ప్రాథమిక ‘కీ’ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంచినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.లింగయ్య తెలిపారు. రెగ్యులర్, ఒకసారి ఫెయిలైన విద్యార్థులు లేట్ ఫీజు లేకుండా డిసెంబర్ 2 వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేశారు. రూ.50 ఫైన్‌తో డిసెంబర్ 8 వరకు, రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 22 వరకు, రూ.500తో జనవరి 4 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులకు రూ.125, ఒకసారి ఫెయిలైన వారికి 3 సబ్జెక్టుల వరకు రూ.110 , ఒకేషనల్ విద్యార్థులకు అదనంగా రూ.60 ఫీజు ఉంటుందని వివరించారు.
టెట్ కీ రిలీజ్: ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ఈనెల 22న ఆన్‌లైన్‌లో నిర్వహించిన స్పెషల్ టీజీ టెట్-2026 పరీక్షల ప్రాథమిక కీ గురువారం విడుదల చేసినట్లు టెట్ కన్వీనర్ జి.రమేశ్ తెలిపారు. https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో కీ అందుబాటులో ఉందని, దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 28 సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు.
