బెల్ట్ షాపులు బంద్ చేస్తేనే నిధులిస్తా.. యువత బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారు: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి

బెల్ట్ షాపులు బంద్ చేస్తేనే నిధులిస్తా.. యువత బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారు: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి

కోటగిరి, వెలుగు: గ్రామాల్లో బెల్ట్ షాపుల వల్ల యువకులు మద్యానికి బానిసై ప్రాణాలు కోల్పోతున్నారని, 30 నుంచి 40 ఏళ్ల వయస్సులోనే మహిళలు వితంతువులుగా మారుతున్నారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు బంద్​ చేస్తేనే నిధులు ఇస్తానని స్పష్టం చేశారు. 

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మి ఆలయం, జీపీ బిల్డింగ్, అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రం, ఈద్గా కాంపౌండ్​వాల్, మసీదు అదనపు గదులు, బీసీ కమ్యూనిటీ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, సర్పంచ్ పుట్టా శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. 

అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులను తొలగించాలని సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఎక్సైజ్ అధికారులు, పోలీస్ శాఖ, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాసినట్లు తెలిపారు. 

ప్రస్తుతం నియోజకవర్గంలో 4 వేల ఇందిరమ్మ ఇళ్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. స్థలం ఉన్న ప్రతి పేదవాడు సొంత ఇల్లు నిర్మించుకునేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. బస్వాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమర్థంగా పనిచేస్తున్న సర్పంచ్ శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతు, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ ఏఎంసీ చైర్మన్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.