రాజ్యాంగ విలువలు కాపాడుకోవాలి : స్పీకర్ ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా

రాజ్యాంగ విలువలు కాపాడుకోవాలి : స్పీకర్ ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా
  • అసెంబ్లీ, మండలి ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన స్పీకర్ ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా

హైదరాబాద్, వెలుగు: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, శాసన మండలిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రెండు సభల ఉద్యోగులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలను మార్చే గొప్ప శక్తిని రాజ్యాంగం ప్రజలకు కల్పించిందని కొనియాడారు. 

ప్రతి పౌరుడు రాజ్యాంగం, అది కల్పించిన హక్కులపై అవగాహన పెంచుకోవాలని, రాజ్యాంగ విలువలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, శాసనసభ, మండలి కార్యదర్శులు నర్సింహాచార్యులు, తిరుపతి, ఉద్యోగులు పాల్గొన్నారు.