2027 చివరి నాటికి నిఫ్టీ@ 29000.. జేపీ మోర్గన్ అంచనా

2027 చివరి నాటికి నిఫ్టీ@  29000.. జేపీ మోర్గన్ అంచనా

ముంబై: భారత స్టాక్ మార్కెట్ భవిష్యత్తుపై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గన్  సానుకూలంగా ఉంది. వచ్చే ఏడాది  చివరి నాటికి నిఫ్టీ 50 సూచీ 12 శాతం పెరిగి 29,000 పాయింట్ల స్థాయికి చేరుకుంటుందని గురువారం ఒక రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ‘‘ముడిచముwwరు ధరలు తగ్గడం, రూపాయి స్థిరంగా ఉండటం వల్ల కంపెనీల ఖర్చులు తగ్గి లాభాలు పెరగనున్నాయి. 

దీనికి తోడు 8వ పే కమిషన్‌‌‌‌‌‌‌‌ అమలు వల్ల 1.2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల చేతికి రూ. 7.2 లక్షల కోట్లు రానుండటంతో మార్కెట్లో కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి.  నవంబర్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే 14 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐలు) రాగా, రాబోయే రోజుల్లో మరో 100 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది.

 బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్, పరిశ్రమల షేర్లు రాణిస్తాయి”అని జేపీ మోర్గాన్ వివరించింది. మరోవైపు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ డిసెంబర్, ఫిబ్రవరి, ఏప్రిల్ ఎంపీసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లలో  వడ్డీ రేట్లను 0.25శాతం చొప్పున మూడుసార్లు పెంచవచ్చని తెలిపింది.