- విషయం తెలిపి కాంగ్రెస్శ్రేణుల ఎంట్రీ
- హోటల్‌లో ఇరు వర్గాల బాహాబాహీ
ముషీరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణలో నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని 3 సంవత్సరాల క్రితం బావర్చి హోటల్‌లో బిర్యానీ తింటూ హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ, ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి హోటల్ లోపలికి రాహుల్ చిత్రపటాన్ని తీసుకొచ్చి, ఆయనకు బిర్యానీ తినిపిస్తున్నట్లుగా నిరసన చేపట్టారు.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, అరవింద్కుమార్యాదవ్బావర్చి హోటల్ కి తమ అనుచరులతో చేరుకోవడంతో ఇరు పార్టీల నేతలు బాహా బాహీకి దిగారు. బావర్చి హోటల్ లో ఇరు వర్గాలు ఫర్నిచర్. ప్లేట్లు ధ్వంసం చేశాయి. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో చిక్కడపల్లి, దోమలగూడ పోలీసులు హోటల్ వద్దకు చేరుకొని ఇరు పార్టీల నాయకులకు సర్ధి చెప్పే ప్రయత్రం చేశారు. పరిస్థితి చేయిదాటి పోతుందని గమనించి స్వల్పంగా లాఠీచార్జీ చేసి ఇరు వర్గాలను చెదురగొట్టారు. అనంతరం పోలీసులు బావర్చి హోటల్ ను మూసివేశారు.
