రాష్ట్ర స్థాయి రోల్ ప్లే పోటీల్లో తిమ్మాపూర్ కేజీబీవీ ఫస్ట్

రాష్ట్ర స్థాయి రోల్ ప్లే పోటీల్లో తిమ్మాపూర్ కేజీబీవీ ఫస్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర స్థాయి రోల్ ప్లే పోటీల్లో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కేజీబీవీ, ఫోక్ డ్యాన్స్ పోటీల్లో నిర్మల్ జిల్లా టీజీఆర్‌ఎస్‌జేసీ జట్లు ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. నేషనల్ పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్​లో భాగంగా ఎస్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 25, 26 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. 

రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన ఈ 2 జట్లు వచ్చే ఏడాది జనవరిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ప్రదర్శన ఇవ్వనున్నాయి. జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి. విజేతలకు ఎస్‌సీఈఆర్టీ అధికారులు బహుమతులు అందించారు.