లక్నో: ఇండియా యంగ్ షట్లర్ తన్వీ శర్మ.. సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్–300 టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తన్వీ 18–21, 21–18, 21–18తో ముతియారా ఆయు పుష్పితసారి (ఇండోనేసియా)పై గెలిచింది. మూడోసీడ్ ఉన్నతి హుడా 21–14, 21–18తో ఇషికా జైస్వాల్ (అమెరికా)పై, తస్నిమ్ మీర్ 21–19, 21–15తో గిల్మర్ (స్కాట్లాండ్)పై, అస్మితా చాలిహా 21–16, 21–15తో అన్మోల్ ఖర్బ్‌పై నెగ్గారు.
విమెన్స్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ట్రీసా–గాయత్రి 21–9, 21–8తో శ్రేయ బాలాజీ–ప్రణవి నటరాజన్‌పై గెలిచారు. మెన్స్ సింగిల్స్‌లో తుషార్ సువీర్ 21–14, 21–12తో శాశ్వత్ దలాల్‌పై నెగ్గగా, డబుల్స్‌లో అర్జున్–హరిహరన్ 21–12, 22–20తో మేయెల్ క్యాటోయెన్–లుకాస్ రనోయిర్ (ఫ్రాన్స్)ను ఓడించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో విరాజ్–రుతుపర్ణ 16–21, 21–13, 21–17తో గ్రెగోయిర్ డెస్చాంప్ (ఫ్రాన్స్)–ఇబెన్ బెర్గ్‌స్టెయిన్ (డెన్మార్క్)పై గెలిచారు.
