కోల్‌కతా: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో.. హైదరాబాద్ జట్టు నాకౌట్‌కు చేరలేకపోయింది. టార్గెట్ ఛేజింగ్‌లో హిమతేజ (81 నాటౌట్) చెలరేగడంతో.. గ్రూప్–డిలో గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఒడిశాపై గెలిచింది. కానీ 18 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. ముంబై, విదర్భ చెరో 26 పాయింట్లతో నాకౌట్‌కు క్వాలిఫై అయ్యాయి.
టాస్ ఓడిన ఒడిశా 20 ఓవర్లలో 206/8 స్కోరు చేసింది. ఆదిత్య రౌట్ (95), గౌరవ్ చౌదరి (40), స్వస్తిక్ సామల్ (34) రాణించారు. అజయ్ దేవ్ గౌడ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత హైదరాబాద్ 19.1 ఓవర్లలో 207/5 స్కోరు చేసింది. అమన్ రావు (31), అభిరత్ రెడ్డి (30), గడుగు గణేశ్ (25) మెరుగ్గా ఆడారు. హిమతేజకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
