సీనియర్ లాయర్లకు సన్మానం..హైకోర్టులో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

సీనియర్ లాయర్లకు సన్మానం..హైకోర్టులో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గురువారం హైకోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు ఎస్. సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. సామ్ కోశి, న్యాయమూర్తులు జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి, జస్టిస్ టి.మాధవీదేవి, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ జె.శ్రీనివాసరావు, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ జీఎం.మొహియుద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, అడ్వకేట్ జనరల్ ఎస్.సుదర్శన్ రెడ్డి, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ రామిరెడ్డి సామల, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు హాజరయ్యారు. న్యాయవాద వృత్తికి, న్యాయవ్యవస్థకు విశేష సేవలందించిన సీనియర్ అడ్వకేట్లను సంఘం సత్కరించింది. 

ఈ సందర్భంగా జడ్జిమెంట్ డిస్కషన్ క్లబ్‌ను ప్రారంభించారు. సంఘం కార్యదర్శి పి. శ్రవణ్ కుమార్ గౌడ్ స్వాగతం చెప్పగా, మరో కార్యదర్శి కె. నిరంజన్ రెడ్డి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో అదనపు అడ్వకేట్ జనరల్స్ తేరా రజనీకాంత్ రెడ్డి, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎన్. భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.