5 ఏళ్లలో 50 లక్షల ఉద్యోగాలు! క్యాపిటల్ గూడ్స్, షిప్ బిల్డింగ్, డిఫెన్స్ సెక్టార్లలో భారీ అవకాశాలు

5 ఏళ్లలో 50 లక్షల ఉద్యోగాలు! క్యాపిటల్ గూడ్స్, షిప్ బిల్డింగ్, డిఫెన్స్ సెక్టార్లలో భారీ అవకాశాలు
  •  సాధారణ డిగ్రీల కంటే  టెక్నీషియన్లు, వెల్డర్లు, రిగ్గర్లు, సీఎన్‌‌‌‌‌‌‌‌సీ మెషీన్ ఆపరేటర్లకే ఎక్కువ డిమాండ్‌‌‌‌‌‌‌‌ 
  •  ఒక్క షిప్‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌, మెయింటెనెన్స్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  2 లక్షల ఉద్యోగాలు
  • క్యాపిటల్ గూడ్స్ అండ్  స్ట్రాటజిక్ స్కిల్ కౌన్సిల్ వెల్లడి

బెంగళూరు: దేశంలోని భారీ యంత్రాల తయారీ (క్యాపిటల్ గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), డిఫెన్స్‌‌‌‌‌‌‌‌, షిప్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌  రంగాల్లో వచ్చే ఐదేళ్లలో ఏకంగా 50 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఈ విషయాన్ని ‘క్యాపిటల్ గూడ్స్ అండ్ స్ట్రాటజిక్ స్కిల్ కౌన్సిల్ (సీజీఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ) సీఈఓ షాలిని సింగ్ ‘డిడాక్ స్కిల్స్ 2026’ సదస్సులో తెలిపారు. ‘‘దేశంలో ఫ్యాక్టరీలు, డిఫెన్స్ పరికరాల తయారీ, షిప్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణం, మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌ రంగాల్లో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. 

దీంతో సాధారణ చదువుల కంటే నైపుణ్యం ఉన్న టెక్నీషియన్లు, వెల్డర్లు, రిగ్గర్లు, సీఎన్‌‌‌‌‌‌‌‌సీ మెషిన్ ఆపరేటర్లు, ఆటోమేషన్ నిపుణులకు విపరీతమైన గిరాకీ ఏర్పడనుంది”అని వివరించారు.   షిప్‌‌‌‌‌‌‌‌ల తయారీలో ఎక్కువ ప్రస్తుతం మారిటైమ్‌‌‌‌‌‌‌‌ రంగంలో దాదాపు లక్ష మంది సిబ్బంది, షిప్‌ల తయారీ, మెయింటెనెన్స్ సెక్టార్‌‌లో 2 లక్షల మందికి పైగా వెల్డర్లు, రిగ్గర్లు, సీఎన్‌‌‌‌‌‌‌‌సీ ఆపరేటర్ల అవసరం తక్షణమే ఉందని షాలిని సింగ్ పేర్కొన్నారు.  పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యువతకు సరైన శిక్షణ, సర్టిఫికేషన్ అందిస్తేనే ఈ 50 లక్షల ఉద్యోగాలను అందిపుచ్చుకోగలరని ఆమె స్పష్టం చేశారు. 

ఇందుకోసం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ, ప్రముఖ కంపెనీలతో కలిసి అడ్వాన్స్డ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.   ఆసియాలోనే అతిపెద్ద విద్యా, నైపుణ్యాభివృద్ధి ప్రదర్శన అయిన ‘డిడాక్ ఇండియా – డిడాక్ స్కిల్స్ 2026’ సదస్సు బెంగళూరులోని బీఐఈసీలో నవంబర్ 25 నుంచి 27 వరకు జరుగుతోంది. చదువులకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, యువతను ఉద్యోగాలకు సిద్ధం చేయడమే ఈ సదస్సు 
ప్రధాన ఉద్దేశం. 

ఎస్‌‌‌‌‌‌‌‌బీఐలో భారీ నియామకాలు 

 ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ  స్పెషల్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ ద్వారా రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్ కేటగిరీల్లో ఉన్న 1,540 జూనియర్ అసోసియేట్ (క్లర్క్) బ్యాక్‌‌‌‌‌‌‌‌లాగ్ ఖాళీలను త్వరలో భర్తీ చేయనుంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్లరికల్, ఆఫీసర్ విభాగాల్లో మొత్తం 11,000 నుంచి 12,000 మంది కొత్త సిబ్బందిని నియమించుకోనున్నట్లు బ్యాంక్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా క్లర్క్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌ల కోసం రాత పరీక్షలను పూర్తిచేసింది. సెప్టెంబర్ 16న ప్రిలిమ్స్, అక్టోబర్ 29న మెయిన్స్ పరీక్షల ద్వారా ఈ ఎంపిక పూర్తయింది. 

కొత్తగా ఎంపికైన జూనియర్ అసోసియేట్లు కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగాల్లో పనిచేస్తారు. దీనివల్ల బ్రాంచీల్లో సేవలు మరింత వేగవంతం అవుతాయని ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ ఛైర్మన్ సి.ఎస్. శెట్టి పేర్కొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా కొత్తగా 200-250 బ్రాంచీలను ప్రారంభిస్తామని అన్నారు. ప్రస్తుతం ఎస్‌‌‌‌‌‌‌‌బీఐలో 2.47 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.