45 నెంబర్ జెర్సీతో హింట్ ఇచ్చిన ముంబై.. రేపే రోహిత్‌ కెప్టెన్సీపై బిగ్ అనౌన్స్‌మెంట్!

45 నెంబర్ జెర్సీతో హింట్ ఇచ్చిన ముంబై.. రేపే రోహిత్‌ కెప్టెన్సీపై బిగ్ అనౌన్స్‌మెంట్!

Rohit Sharma MI Captain: ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్‌కు ముందు క్రికెట్ అభిమానులకు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma) మళ్లీ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాడనే సంకేతాలను ఫ్రాంచైజీ ఇచ్చింది. ఈరోజు (గురువారం, నవంబర్ 26) సాయంత్రం 5:45 గంటలకు "24 hours to go", రేపటి తేదీ (శుక్రవారం, 27-11-2026)తో ఒక ప్రత్యేక వీడియోను పోస్ట్ చేయడంతో, రేపు రోహిత్ రీ-ఎంట్రీపై అధికారిక ప్రకటన రావడం దాదాపు ఫిక్స్ అయింది. 

5:45 PMకే ముంబై పోస్ట్.. రోహిత్ మ్యాజిక్: 

* రెండో హింట్: నిన్న (బుధవారం, నవంబర్ 25) ముంబై ఇండియన్స్ క్యాప్ పట్టుకున్న ఒక ఆటగాడి చేయి ఫోటోను పోస్ట్ చేయగా, అది రోహిత్ శర్మదేనని అభిమానులు అప్పుడే అంచనా వేశారు. ఇక ఈరోజు ( గురువారం, నవంబర్ 26) సరిగ్గా సాయంత్రం 5:45 గంటలకు వీడియో విడుదల చేసి, రేపు (నవంబర్ 27) అదే సమయానికి అసలు విషయం ప్రకటించబోతున్నట్లు హింట్ ఇచ్చేసింది. 

* 45 జెర్సీకి వీడ్కోలు: టీమిండియాకు, ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ ధరించే జెర్సీ నంబర్ 45. అందుకే 5:45 PM టైమింగ్ ఎంచుకుని హిట్‌మ్యాన్‌కు స్పెషల్ గిప్ట్ ఇవ్వబోతున్నట్లు అర్థమైతుంది.  

హార్దిక్ ట్రేడ్.. మళ్లీ రోహిత్ వైపే?: 

* 2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ (GT) నుంచి ట్రేడ్ ద్వారా వచ్చిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కోసం రోహిత్‌ను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ముంబై రాత మారిపోయింది. 

* హార్దిక్ కెప్టెన్సీలో నిరాశ: గుజరాత్‌ను 2022లో ఛాంపియన్‌గా, 2023లో రన్నరప్‌గా నిలిపిన హార్దిక్, ముంబై కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు. 2024లో ముంబై చిట్టచివరి స్థానం (10వ స్థానం)లో నిలవగా, 2025 ప్లేఆఫ్స్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఇక 2026 సీజన్‌లో 9వ స్థానంతో ఘోరంగా నిరాశపరిచింది.

* పంజాబ్‌కు హార్దిక్.. ముంబైలోకి అర్ష్‌దీప్: ఇటీవలే హార్దిక్ పాండ్యా ట్రేడ్ డీల్ ద్వారా పంజాబ్ కింగ్స్ (PBKS) కు వెళ్లిపోగా, అతడి స్థానంలో స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు.

* సూర్య, బుమ్రా కాదు రోహిత్‌కే పగ్గాలు: జట్టులో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, 39 ఏళ్ల రోహిత్ శర్మకే మళ్లీ కెప్టెన్సీ అప్పగించాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2013 మధ్యలో రికీ పాంటింగ్ స్థానంలో కెప్టెన్ అయిన రోహిత్, 2023 వరకు 5 ఐపీఎల్ ట్రోఫీలు (2013, 2015, 2017, 2019, 2020), 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిల్ అందించాడు.