పరువు కోసం కన్నకూతురిని హత్య చేసిన తండ్రి..ఆదిలాబాద్జిల్లా నార్నూర్మండలంలో ఘటన

పరువు కోసం కన్నకూతురిని హత్య చేసిన తండ్రి..ఆదిలాబాద్జిల్లా నార్నూర్మండలంలో ఘటన

ఆదిలాబాద్​టౌన్ / గుడిహత్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (నార్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), వెలుగు : కుటుంబ పరువు పోతుందనే కారణంతో కన్నకూతురిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉట్నూర్​ ఏఎస్పీ రుత్విక్​వివరాలు వెల్లడించారు. 

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన ఆడే కైలాష్ కుమార్తె కల్యాణికి వివాహం నిశ్చయమై, మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే ఆమె మరో వ్యక్తిని ప్రేమిస్తున్న విషయం తెలుసుకున్న కైలాష్ ఈ నెల 24న తెల్లవారుజామున దిండుతో ముఖంపై అదిమి హత్య చేశాడు. 

అనంతరం చున్నీతో ఉరేసుకున్నట్లు చిత్రీకరించి, మృతదేహాన్ని హడావుడిగా దహనం చేశాడు. గ్రామ కార్యదర్శి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు తండ్రే హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు.